iDreamPost
android-app
ios-app

గ్రెగ్‌ చాపెల్‌.. రెండేళ్లు టీమిండియాను పీడించిన భూతం! గంగూలీని దారుణంగా వేధించాడు!

  • Published Oct 07, 2024 | 3:32 PM Updated Updated Oct 07, 2024 | 3:32 PM

Greg Chappell, Sourav Ganguly: ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో ఓ వరెస్ట్‌ కోచ్‌ ఉన్నాడు. ఆ కోచ్‌ ఎవరు? అతను టీమిండియాను ఎలా నాశనం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Greg Chappell, Sourav Ganguly: ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో ఓ వరెస్ట్‌ కోచ్‌ ఉన్నాడు. ఆ కోచ్‌ ఎవరు? అతను టీమిండియాను ఎలా నాశనం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Oct 07, 2024 | 3:32 PMUpdated Oct 07, 2024 | 3:32 PM
గ్రెగ్‌ చాపెల్‌.. రెండేళ్లు టీమిండియాను పీడించిన భూతం! గంగూలీని దారుణంగా వేధించాడు!

ఇండియన్‌ క్రికెట్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. క్రికెట్‌ దేవుడిగా సచిన్‌ టెండూల్కర్‌, భారత క్రికెట్‌ తలరాత మార్చిన కెప్టెన్‌గా గంగూలీ, ది వాల్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా ధోని.. వీళ్లతో పాటు.. సెహ్వాగ్‌, యువరాజ్‌, జహీర్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వరకు.. అనేక మంది ఆటగాళ్లు సూపర్‌ స్టార్లుగా ఎదిగారు. కానీ, వీరిలో కొంతమంది దిగ్గజ క్రికెటర్లను దారుణంగా వేధించి, ఇండియన్‌ క్రికెట్‌ను ఓ రెండేళ్లలో సర్వనాశనం చేసిన ఓ విలన్‌ ఉన్నాడు. అతను ప్లేయర్‌ కాదు.. కోచ్‌గా వచ్చి శనిలా దాపురించాడు. అతని పేరు గ్రెగ్‌ చాపెల్‌. ఈ పేరు వింటే ఇప్పటికీ బీసీసీఐ ఉలిక్కిపడుతుంది. గంగూలీ కెప్టెన్సీలో ఆడిన చాలా మంది స్టార్లు.. వామ్మో అతనా అంటూ ఇప్పటికే ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తారు. అంతలా ఇండియన్‌ క్రికెట్‌పై నెగిటివ్‌ ఇంప్యాక్ట్‌ చూపిన ఏకైక కోచ్‌ చాపెల్‌. ఎన్నో అంచనాల మధ్య భారత కోచ్‌గా వచ్చిన చాపెల్‌.. ఒక్కో ప్లేయర్‌ను గిల్లుకుంటూ.. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత వరెస్ట్‌ కోచ్‌గా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా రీబిల్డ్‌ అవుతోంది. సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌ లాంటి సీనియర్లను కలుపుకొని.. వీరేందర్‌ సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌, మొహమ్మద్‌ కైఫ్‌, హర్భజన్‌ సింగ్‌, ధోని లాంటి యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ.. వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇస్తూ.. ఒక కొత్త టీమిండియాను నిర్మించుకున్నాడు గంగూలీ. ఒక ప్లేయర్‌గా అద్భుతంగా ఆడుతూనే.. మరోవైపు కెప్టెన్‌ అద్భుతమైన టీమ్‌ను బిల్డ్‌ చేసుకున్నాడు గంగూలీ. అయితే.. గంగూలీ ఎలాంటి పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో తెలుసా? ఫిక్సింగ్‌ భూతం టీమిండియాని కుదిపేసిన తర్వాత.. ప్రపంచ క్రికెట్‌ ముందు భారత క్రికెట్‌ పరువు పోయిన తర్వాత.. జట్టు కెప్టెన్సీ చేపట్టేందుకు ఎవరు ముందుకు రాని సమయంలో.. గంగూలీ ఒక్కడే ముందుకొచ్చి.. పగ్గాలు అందుకున్నాడు.. జట్టును తిరుగులేని శక్తిగా మార్చాడు. భారత క్రికెట్‌ తలరాత మార్చిన కెప్టెన్‌ అని గంగూలీని ఊరికే పొగడరు.

విదేశాల్లో కూడా గెలవడం నేర్పాడు, ప్రత్యర్థి ఒక మాట రెండు మాటలు అనేలా ఒక సింహంలా జట్టును తయారుచేశాడు. మట్టిలో మాణిక్యాలను వెతికి పట్టుకున్నాడు.. టాలెంట్‌ ఉంటే చాలు నెత్తిన పెట్టుకునేవాడు.. అలాగే సీనియర్లను కూడా బ్యాలెన్స్‌ చేస్తూ.. టీమ్‌ను నడింపించాడు. 2003లో టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడింది అంటే.. అందులో గంగూలీ కష్టం ఎంతో ఉంది. ఆ తర్వాత కూడా భారత జట్టు.. ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. దాదా కెప్టెన్సీలోని భారత జట్టు ఆట, విజాయాలతో టీమిండియా అభిమానులంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అప్పుడొచ్చాడు.. గ్రెగ్‌ చాపెల్‌. ఈ మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఇండియాకు హెడ్‌ కోచ్‌ వస్తున్నాడంటూ.. అంతా సంతోషించారు. అతని కోచింగ్‌పై ఎంతో నమ్మకంతో టీమిండియాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్తాడని అంతా భావించారు. కానీ, అతను రివర్స్‌లో తీసుకెళ్లాడు. అతని కంటే ముందున్న టీమిండియా టీమిండియా కోచ్‌గా చేసిన జాన్‌ రైట్‌ కంటే చాపెల్‌ ఇంకా బెటర్‌గా టీమిండియాను తీర్చిదిద్దుతాడు.. 2003లో ఒక్క మ్యాచ్‌తో మిస్‌ అయిన వన్డే వరల్డ కప్‌ను 2007లో ఇండియాకు అందిస్తాడని అంతా నమ్మారు. కానీ, అతను వచ్చి.. టీమిండియాను సర్వనాశనం చేశాడు.

2005 మేలో గ్రెగ్‌ చాపెల్‌ను.. టీమిండియా కోచ్‌గా నియమించింది బీసీసీఐ. అప్పటికే టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. జాన్‌ రైట్‌ కోచింగ్‌తో చాలా బెటరైన భారత జట్టును.. ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడమే చాపెల్‌ ముందున్న టాస్క్‌. అది చేయకుండా.. జట్టు మొత్తాన్ని గెలికిపడేశాడు. ఎవరితో పెట్టుకోవద్దో.. అతనితోనే పెట్టుకున్నాడు. కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతో చాపెల్‌కు అస్సలు పడేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. గంగూలీ గురించి లేనిపోని విషయాలు బీసీసీఐకి చెప్పి.. దాదాపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ తీసుకొచ్చేవాడు. అలాగే సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సెహ్వాగ్‌.. స్టార్‌ క్రికెటర్ల టెక్నిక్‌ సరగ్గా లేదని.. పూర్తిగా మార్చేయాలని ప్రయత్నించాడు. అది దారుణంగా బెడిసి కొట్టింది. ఏ ప్లేయర్‌కైనా.. నాచ్యురల్‌ గేమ్‌, బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఉంటుంది. అదే వాళ్ల బలం. కానీ, చాపెల్‌ దాన్నే మార్చాలని ముర్ఖంగా మొండి పట్టుదలకు వెళ్లాడు. డాషింగ్‌ బ్యాటింగ్‌కి, అగ్రెసివ్‌ ఇంటెంట్‌కు పెట్టింది పేరైన సెహ్వాగ్‌ను డిఫెన్సివ్‌గా ఆడాలని చెప్పేవాడు.

సాలిడ్‌ డిఫెన్స్‌తో అప్పటికే ది వాల్‌ అని బిరుదు తెచ్చుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ను అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేయాలని, ఫస్ట్‌ బాల్‌ నుంచే హిట్టింగ్‌ దిగాలని ఆదేశించేవాడు. అది వారి నాచ్యురల్‌ గేమ్‌ కాదు.. దీంతో.. వారితో కూడా చాపెల్‌కు విబేధాలు వచ్చాయి. అంతెందుకు క్రికెట్‌ దేవుడిగా ఎదిగిన సచిన్‌ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ కూడా చాపెల్‌కు నచ్చలేదంటే.. అర్థం చేసుకోవచ్చు. ఆయన టీమిండియాలో ఎలాంటి అభద్రతా భావం, నెగిటివిటీని నింపాడు. దాదా వర్సెస్‌ చాపెల్‌ ఫైట్‌లో టీమిండియా రెండుగా విడిపోయి.. గ్రౌండ్‌లో మ్యాచ్‌లు గెలవడం కంటే.. జట్టులో వర్గం పోరు గెలవడం ముఖ్యమైపోయింది. టీమ్‌లో యూనిటీ అన్నదే లేకుండా పోయింది. టీమ్‌లో ఇలాంటి వాతావరణం ఉంటే.. ఏ టీమ్‌ సక్సెస్‌ అవుతుంది చెప్పండి. సరిగ్గా అదే జరిగింది. టీమిండియా ప్రదర్శనపై దారుణమైన ఎఫెక్ట్‌ పడింది. దాంతో.. కెప్టెన్‌గా గంగూలీ పనికి రాడంటూ.. ఏకంగా బీసీసీఐకి చాపెల్‌ ఒక మెయిల్‌ పంపాడు. ఆ మెయిల్‌ కాస్త లీక్‌ కావడంతో.. చాపెల్‌పై విమర్శల వర్షం కురిసింది.

ఇండియన్‌ టీమ్‌లో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌గా ఎదుగుతున్న గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐకి కోచ్‌ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ గొడవల వల్ల.. కెప్టెన్సీతో పాటు గంగూలీ ఏకంగా టీమ్‌లో కూడా చోటు కోల్పోయాడు. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. గంగూలీ గురించి బీసీసీఐకి లేక రాయడంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలతో నిరసనలు తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే.. అది గంగూలీ సొంతరాష్ట్రం. అతన్ని బెంగాల్‌ టైగర్‌ అని, ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా అని, మహారాజా ఆఫ్‌ బెంగాల్‌ అని క్రికెట్‌ ఫ్యాన్స్‌​ అభిమానించడం కాదు.. దేవుడిలా ఆరాధిస్తారు. అలాంటి స్టేట్‌లోని ఈడెన్‌ గార్డెన్స్‌లో 2005 నవంబర్‌ 25న సౌతాఫ్రికాతో టీమిండియా ఒక మ్యాచ్‌ వన్డే మ్యాచ్‌ ఆడింది.

దాదాపై కోపంతో.. ఆ మ్యాచ్‌లో అతన్ని ఆడించలేదు చాపెల్‌. తాము దేవుడిలా ఆరాధించే క్రికెటర్‌ను, తమ స్టేట్‌లో మ్యాచ్‌ జరుగుతుంటే.. బెంచ్‌పై కూర్చోబెట్టడంతో.. కోల్‌కత్తా క్రికెట్‌ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోచ్‌ చాపెల్‌తో పాటు, టీమిండియా క్రికెటర్లను కూడా తిట్టిపోశారు. గ్రౌండ్‌లోనే భారత క్రికెటర్ల ఫొటోలను తగలబెట్టారు. ఇలా ఇండియాలో ఇండియన్‌ ప్లేయర్లను సొంత అభిమానులతో తిట్టించిన ఘనత ఒక్క చాపెల్‌కే దక్కింది. ఇక 2007 వన్డే వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియా రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో సిద్ధమైంది. కానీ, చాపెల్‌ పుణ్యామా అని.. జట్టులో ఐక్యత లేదు, ఆటగాళ్లకు తమ ఆటపై నమ్మకం లేదు, కోచ్‌కి తమ బ్యాటింగ్‌ టెక్నిక్‌పై నమ్మకం లేదనే భావనే.. వారిలో నిరాశకు నిలయమైంది. ఇంక మ్యాచ్‌లు ఏం గెలుస్తారు. టీమ్‌ చూస్తే.. పేపర్‌పై ఎంతో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. ఆటలో జీవం లేదు. అది 2007 వన్డే వరల్డ్‌ కప్‌లో స్పష్టంగా కనిపించింది. భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత దారుణంగా.. ఓ వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇది ఒక రకంగా టీమిండియాకు ఘోర అవమానం.

2003లో వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన జట్టు.. అప్పటి కంటే ఇంకా స్ట్రాంగ్‌గా కనిపించినా.. గ్రూప్‌ స్టేజ్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంకపై ఓడిపోయింది. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత చాపెల్‌ తన పదవికి రాజీనామా చేశాడు. అప్పుడు కూడా తన తప్పులను ఒప్పుకోకుండా.. టీమిండియా ఆటగాళ్లపైనే ఆరోపణలు గుప్పించాడు. కానీ, ఒక్కసారి చాపెల్‌ జట్టును వీడిన తర్వాత.. చాలా ఫాస్ట్‌గా టీమిండియా ట్రాక్‌లో పడింది. ఇంగ్లండ్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. ఆ వెంటనే కుర్రాళ్లు.. టీమిండియాను టీ20 ఛాంపియన్‌గా నిలిపారు. గ్రెగ్‌ చాపెల్‌ అనే శని.. టీమిండియాను ఎంతలా పట్టిపీడించాడంటే.. గంగూలీ, ద్రవిడ్‌ లాంటి దిగ్గజాలకు వరల్డ్‌ కప్‌ లేకుండా చేశాడు. తాను నిర్మించుకున్న ఒక టీమ్‌తో ఓ అద్భుత విజయాన్ని అందుకోనివ్వకుండా గంగూలీని జట్టుకు, కెప్టెన్సీ దూరం చేశాడు. చాపెల్‌ చూపించినంత నెగిటివ్‌ ఇంప్యాక్ట్.. ఇప్పటి వరకు భారత క్రికెట్‌పై మరెవరూ చూపించలేదంటే.. అతిశయోక్తి కాదు. మరి చాపెల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.