Nidhan
Rishabh Pant Bowls Spin To Shubman Gill: బంగ్లాదేశ్‌తో సెకండ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. కాన్పూర్‌లో ఆ జట్టు కథ ముగించి సిరీస్‌ను చేతపట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.
Rishabh Pant Bowls Spin To Shubman Gill: బంగ్లాదేశ్‌తో సెకండ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. కాన్పూర్‌లో ఆ జట్టు కథ ముగించి సిరీస్‌ను చేతపట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు.
Nidhan
బంగ్లాదేశ్‌తో సెకండ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన.. కాన్పూర్‌లో కథ ముగించి సిరీస్‌ను చేత పట్టాలని చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం ఇక్కడికి చేరుకున్న ప్లేయర్లు.. కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో చెమటలు చిందిస్తున్నారు. బ్యాటర్లు గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. పేస్ కంటే స్పిన్‌ను ఫేస్ చేయడం మీద ఫోకస్ చేశారు. బౌలర్లు కూడా రిథమ్ కంటిన్యూ అయ్యేలా కష్టపడ్డారు. అయితే నెట్స్‌లో యంగ్‌స్టర్స్ శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ప్రాక్టీస్ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. నెట్ సెషన్లో గిల్‌తో ఆడుకున్నాడు పంత్. బౌలర్‌గా మారి అతడ్ని భయపెట్టాడు. షాట్స్ కొట్టమంటూ ఏడిపించాడు.
బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగిన గిల్.. భారీ షాట్లు బాదుతానని రవీంద్ర జడేజాకు ప్రామిస్ చేశాడు. డ్రైవ్స్‌తో పంత్ మీద విరుచుకుపడతానని అన్నాడు. బాల్స్ పట్టాల్సిందిగా జడ్డూకు రిక్వెస్ట్ చేశాడు. దీంతో బాల్ చేతపట్టిన పంత్ తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్.. పంత్‌ను ఎంకరేజ్ చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో బౌలింగ్ చేశావ్ కదా అన్నాడు. అయితే రిషబ్ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. ‘ఔను చేశా. అపోజిషన్ టీమ్ ఒక్క రన్ మాత్రమే చేయాల్సి ఉంది. అందుకే బౌలింగ్ చేశా’ అన్నాడు. ఈ జవాబుకు నవ్వును కంట్రోల్ చేసుకున్నాడు రాహుల్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ను లెగ్ స్పిన్ డెలివరీస్‌తో ఇబ్బంది పెట్టాడు పంత్.
పంత్ వేసిన ఓ బాల్‌ను గిల్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఆ బాల్ అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లిపోయింది. భలేగా బీట్ చేశాను అంటూ శుబ్‌మన్‌ను ఏడిపించాడు పంత్. నవ్వుతూ అతడ్ని ఆటపట్టించాడు. రిషబ్‌తో పాటు ఇతరుల బౌలింగ్‌లోనూ ఆడిన గిల్.. సూపర్బ్‌గా ప్రాక్టీస్ చేయించావంటూ పంత్‌ను పొగిడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ బిగ్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇక, చెన్నై టెస్ట్‌లో ఈ ఇద్దరు యంగ్ బ్యాటర్స్ సెంచరీలతో మోత మోగించారు. భారీ ఇన్నింగ్స్‌లతో బంగ్లాదేశ్‌కు వణుకు పుట్టించారు. కాన్పూర్ టెస్ట్‌లోనూ ఆ జట్టు బౌలర్లతో ఆడుకోవాలని చూస్తున్నారు. వీళ్ల ప్రాక్టీస్ చూస్తుంటే.. అపోజిషన్ టీమ్‌కు దబిడిదిబిడేనని అనిపిస్తోంది.
Spin bowling practice anyone? 🤔
We have a new spinner in town 😎@RishabhPant17 rolls his arm over 👌👌#TeamIndia | #INDvBAN | @ShubmanGill | @klrahul | @IDFCFIRSTBank pic.twitter.com/nlifAHo9Qu
— BCCI (@BCCI) September 26, 2024