iDreamPost
android-app
ios-app

టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్? క్లారిటీ ఇచ్చిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్!

  • Published Sep 26, 2024 | 7:10 PM Updated Updated Sep 26, 2024 | 7:10 PM

Abhishek Nayar Opens About Test Team Vice-Captaincy: టీమిండియా ఇప్పుడు దూకుడు మీద ఉంది. తమను ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్​ను చెన్నై టెస్ట్​లో చిత్తు చేయడంతో హ్యాపీగా ఉంది. ఇదే జోరులో కాన్పూర్ టెస్ట్​లో బంగ్లా కథ ముగించాలని చూస్తోంది.

Abhishek Nayar Opens About Test Team Vice-Captaincy: టీమిండియా ఇప్పుడు దూకుడు మీద ఉంది. తమను ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్​ను చెన్నై టెస్ట్​లో చిత్తు చేయడంతో హ్యాపీగా ఉంది. ఇదే జోరులో కాన్పూర్ టెస్ట్​లో బంగ్లా కథ ముగించాలని చూస్తోంది.

  • Published Sep 26, 2024 | 7:10 PMUpdated Sep 26, 2024 | 7:10 PM
టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్? క్లారిటీ ఇచ్చిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్!

టీ20 వరల్డ్ కప్-2024తో భారత క్రికెట్​లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. లెజెండ్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పోస్ట్​కు గుడ్​బై చెప్పేశాడు. అతడి వారసుడిగా మరో దిగ్గజం గౌతం గంభీర్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఫీల్డింగ్ కోచ్​ టి. దిలీప్​ను మినహాయించి మిగతా సపోర్టింగ్‌ స్టాఫ్​ను గౌతీ మార్చేశాడు. ఐపీఎల్​లో తనతో కలసి పని చేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డొషేట్​ను మెన్ ఇన్ బ్లూలోకి తీసుకొచ్చాడు. దిలీప్ ఫీల్డింగ్ కోచ్​గా కంటిన్యూ అవుతున్నాడు. మోర్కెల్ బౌలింగ్ కోచ్​గా, నాయర్-డొషేట్ అసిస్టెంట్ కోచ్​లుగా వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ విషయంలోనూ ఛేంజెస్ జరిగాయి. పొట్టి ఫార్మాట్​కు రెగ్యులర్ కెప్టెన్​గా సూర్యకుమార్ యాదవ్​కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్​గా శుబ్​మన్ గిల్​ను సెలెక్ట్ చేసింది. అయితే టెస్ట్ వైస్ కెప్టెన్సీపై మాత్రం ఏదీ తేల్చలేదు.

టీ20లు, వన్డేలకు వైస్ కెప్టెన్​గా ఉన్న గిల్​కు లాంగ్ ఫార్మాట్​లోనూ ఆ పోస్ట్ దక్కడం ఖాయమని వినిపించింది. బీసీసీఐ అతడ్ని త్రీ-ఫార్మాట్ ప్లేయర్​గా, ఫ్యూచర్ కెప్టెన్​గా చూస్తోంది. కాబట్టి టెస్టుల్లోనూ వైస్ కెప్టెన్సీ పక్కా అని ఎక్స్​పర్ట్స్ కూడా అన్నారు. అయితే టెస్ట్ టీమ్ కెప్టెన్సీపై తనకు ఇంట్రెస్ట్ ఉందని ఓ సందర్భంలో పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా అన్నాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సారథ్యం అంటే తనకు ఇష్టం అన్నాడు. దీంతో గిల్, బుమ్రా, అశ్విన్​లో ఎవరికి ఈ పోస్ట్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​ టీమ్ అనౌన్స్​మెంట్ టైమ్​లో దీనిపై స్పష్టత రాలేదు. ఈ విషయంపై తాజాగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తేల్చేశాడు. టెస్ట్ టీమ్​కు వైస్ కెప్టెన్ అవసరం లేదన్నాడు. ఆల్రెడీ టీమ్​లో ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నారని.. ఇంకా వైస్ కెప్టెన్ ఎందుకని ఎదురు ప్రశ్నించాడు.

‘ప్రస్తుత భారత టెస్ట్ టీమ్​లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్​లో వివిధ జట్లకు కెప్టెన్స్​గా పనిచేసిన అనుభవం గల వారు ఉన్నారు. యంగ్ ప్లేయర్స్​ను తీసుకుంటే శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ క్యాష్ రిచ్ లీగ్​లో కెప్టెన్స్​గా ఉన్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఫ్యూచర్​లో ఏదో ఒక టీమ్​కు సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ యంగ్​స్టర్స్ వయసులో, అనుభవంలో చిన్నవాళ్లు కావొచ్చు. కానీ క్రికెటర్​గా వాళ్లు డెవలప్ అవుతున్న విధానం, మానసికంగా బలంగా మారుతున్న తీరును బట్టి యువకులు అనలేం. వాళ్లకు లీడర్​షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే జట్టుకు ప్రత్యేకంగా వైస్ కెప్టెన్ అక్కర్లేదు’ అని నాయర్ స్పష్టం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి గిల్, పంత్, జైస్వాల్​లు వేగంగా నేర్చుకుంటున్నారని తెలిపాడు. ఈ ముగ్గురు యంగ్​స్టర్స్​ చేతుల్లో భారత జట్టు ఫ్యూచర్ సేఫ్​గా ఉందన్నాడు నాయర్. మరి.. టీమిండియాకు టెస్టుల్లో వైస్ కెప్టెన్ ఉండాలా? వద్దా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.