Krishna Kowshik
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చిత్రాలు ఎన్ని వచ్చినా అలరిస్తూనే ఉంటాయి. ఇక స్కూల్, కాలేజీ ప్రేమ కథలనైతే చాలా మంది కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో ఉంది వాచ్ చేయండి.
యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చిత్రాలు ఎన్ని వచ్చినా అలరిస్తూనే ఉంటాయి. ఇక స్కూల్, కాలేజీ ప్రేమ కథలనైతే చాలా మంది కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో ఉంది వాచ్ చేయండి.
Krishna Kowshik
ప్రేమ కథా చిత్రాలు.. అస్సలు బోర్ కొట్టవు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ పుట్టడం.. తమ లవ్ సక్సెస్ అయ్యేందుకు తిప్పలు పడటం కామన్. ఇలాంటివి ఎన్ని స్టోరీస్ చూసుంటాం. తిప్పి తిప్పి అదే కథను.. పలు సీసాల్లో వేసి మన ముందు ఉంచుతుంటారు దర్శక నిర్మాతలు. ఇక స్కూల్ అండ్ కాలేజీ లవ్ స్టోరీస్ అయితే చెప్పనక్కర్లేదు. బోలెడు సినిమాలు వచ్చాయి.. అయినా కూడా ఈ ఫ్రెష్ ప్రేమ కథల వైపు ఓ లుక్ వేయనిదే..నిద్ర పట్టదు మూవీ లవర్స్‌కు. ఇలాంటి ఓ స్కూల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. గత ఏడాది తమిళంలో రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో కూడా విడుదలైంది.
గత ఏడాది తమిళంలో రిలీజై మంచి హిట్ అందుకున్న మూవీ రంగోలీ. ఇదే మూవీని సత్య అనే పేరుతో మే 10న తెలుగు ప్రేక్షకుల ముంగిట నిలిచింది. మే నెలలో ఎన్నికల హడావుడి ఉండటంతో ఆ రోజే విడుదలైన కృష్ణమ్మ, ప్రతినిధి 2 వంటి చిత్రాలనే పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఇక సత్య అనే మూవీ వచ్చింది.. పోయింది కూడా తెలియలేదు. ఇప్పుడు ఈ సినిమా మరికొన్ని రోజుల్లో తెలుగు ఓటీటీలోకి రాబోతుంది. కానీ ఇప్పుడు తమిళంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది ఇదే సంస్థ. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. తమిళ్ క్లైమాక్స్, తెలుగు క్లైమాక్స్ వేరు వేరుగా ఉండనున్నాయని తెలుస్తోంది. హమరేష్, ప్రార్థన హీరోహీరోమయిన్లు. ఆడుగళం మురుగుదాస్ కీలక పాత్ర పోషించాడు. ఇక సినిమా విషయానికి వస్తే..
సత్యమూర్తి అలియాస్ సత్య (హమరేష్) ఓ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు. అతని తండ్రి గాంధీ (ఆడుగళం మురుగుదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. సత్యకు మొండితనం ఎక్కువ. సత్య స్కూల్ గ్రౌండ్ విషయంలో తోటి స్నేహితులతో గొడవ పడతాడు. అది చూసిన పోలీసులు అతడ్ని జైలుకు తీసుకు వస్తారు. తండ్రి..పోలీసులను విడిపిస్తాడు. అయితే ఇక్కడే ఉంటే కొడుకు పాడైపోతాడని భావించి.. పెద్ద కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ కూడా ఓ గ్యాంగ్‌తో గొడవ పడుతుంటాడు. అదే కాలేజీలో పార్వతి చదువుతుంటుంది. పార్వతిని ప్రేమిస్తుంటాడు సత్య. కానీ ఓ సమయంలో గౌతమ్‌కు సన్నిహితంగా మెలుగుతుంది. ఇది తట్టుకోలేకపోతాడు సత్య. కానీ అనుకోకుండా స్కూల్ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో తండ్రి తను చేయని తప్పు కోసం అందరి కాళ్లు పట్టుకోవడం చూసిన కొడుకు ఏం చేశాడన్నది మిగిలిన కథ. తెలుగులో రావడానికి కాస్తంత ఆలస్యం అవుతుంది.. తమిళంలో చూడాలనుకుంటే.. వాచ్ చేయండి.