iDreamPost

దెయ్యాలతో యువతి సావాసం.. OTTలో ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి!

OTT Suggestions- Best Horror Movie Corpse Washer: దెయ్యం సినిమాలు అంటే ఇష్ట పడేవాళ్లు ఈ మూవీ తప్పకుండా చూడాలి. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదండోయ్.. వణికిపోతారు. ఓటీటీల్లోనే ఒక బెస్ట్ హారర్ చిత్రం ఇది.

OTT Suggestions- Best Horror Movie Corpse Washer: దెయ్యం సినిమాలు అంటే ఇష్ట పడేవాళ్లు ఈ మూవీ తప్పకుండా చూడాలి. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదండోయ్.. వణికిపోతారు. ఓటీటీల్లోనే ఒక బెస్ట్ హారర్ చిత్రం ఇది.

దెయ్యాలతో యువతి సావాసం.. OTTలో ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి!

దెయ్యాల సినిమాలు చూడటం ఒక బ్యాడ్ హ్యాబిట్. భయమేస్తున్నా చూడటం మాత్రం మానలేము. అలాంటి హారర్ మూవీ లవర్స్ కోసం ఒక అదిరిపోయే సినిమా తీసుకొచ్చాం. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే.. తడిసిపోతుంది. ఇందులో అలా ఇలా కూడా కాదు.. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఎందుకంటే అంత భయంకరంగా.. వణికించేలా ఉంటుంది. ఈ సినిమా కథ ఏంటి? అసలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అంత భయపెట్టే అంశాలు ఏమున్నాయి? కాస్త సవివరంగా తెలుసుకుందాం. డిస్క్లైమర్ ఏంటంటే.. సినిమా నిండా దెయ్యాలే ఉంటాయి.

హారర్ సినిమాలు అంటే కథ, కథనం, టేకింగ్ ఇవ్వన్నీ పక్కన పెడితే భయ పెట్టే అంశాలు ఏమున్నాయి అనేదే ముఖ్యం. అలాంటి అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. గంప గుత్తగా ఉన్నాయి. ఈ సినిమాలో అసలు కథ ఏంటంటే.. తల్లీకూతుళ్లు ఇద్దరూ శవాలను శుభ్రంచేసే పని చేస్తూ ఉంటారు. వాటిని శుభ్రం చేసే క్రమంలో అవి కళ్లు తెరిచి చూస్తాయి కూడా. ఒక్కోసారి దాడి చేసే యత్నం కూడా చేస్తాయి. వాటిని కంట్రోల్ చేసి పని పూర్తి చేయాలి. ఒకసారి తల్లి ఒక్కతే ఆ పని చేస్తుండగా.. ఒక శరీరం లేస్తుంది. ఎంత కంట్రోల్ చేసినా అది కంట్రోల్ అవ్వదు. ఆ తర్వాత ఆమె చనిపోతుంది. తర్వాతి నుంచి ఆ పనిని కూతురు ఒక్కతే కంటిన్యూ చేస్తుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలు అవుతుంది.

ఆ యువతి ఎక్కడికి వెళ్లినా.. అక్కడ దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దెయ్యాలు ఆ యువతిని ఫాలో అవుతూ ఉంటాయి. అంతేకాకుండా.. ఆ తర్వాత ఆ దెయ్యాల వల్ల చాలానే హత్యలు జరుగుతాయి. అవి ఎందుకు చంపుతున్నాయి? అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నాయి? వాటికి ఆమె నుంచి ఏం కావాలి? ఆమెను కాకుండా మిలిగిన వారినే ఎందుకు చంపుతున్నాయి? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు కచ్చితంగా ఈ ‘కార్ప్స్ వాషర్ (Corps Washer)’ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కచ్చితంగా ఈ మూవీని ఒంటరిగా చూడకండి. అలాగే హార్ట్ పేషెంట్స్ కూడా ఈ సినిమా చూడకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ చూడాలి అనుకుంటే క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి