iDreamPost

భార్యతో గొడవలా? ఇద్దరూ కలిసి OTTలో ఈ మూవీ చూడండి సెట్ అవుతారు!

OTT Suggestions- Best Couple Family Drama: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక కపుల్ ఫ్యామిలీ డ్రామా మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇందులో యాక్టింగ్, కామెడీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

OTT Suggestions- Best Couple Family Drama: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక కపుల్ ఫ్యామిలీ డ్రామా మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇందులో యాక్టింగ్, కామెడీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

భార్యతో గొడవలా? ఇద్దరూ కలిసి OTTలో ఈ మూవీ చూడండి సెట్ అవుతారు!

సాధారణంగా కుటుంబం అంటే బాధ్యతలు.. భార్యాభర్తలు అంటే గొడవలు తప్పకుండా ఉంటాయి. ఈ మాట మేము చెప్తున్నది కాదు.. ఎంతో మంది భార్యా భర్తలు, సోషల్ మీడియా పండితులు చెప్తున్నదే. మీరు కూడా ప్రేమ ఉంటేనే గొడవులు ఉంటాయి అనే కొటేషన్స్ కూడా చాలానే చూసుంటారు. అలాంటి ఒక ప్యాట్రన్ లో తెరకెక్కిన భార్యభర్తల కామెడీ డ్రామా ఓటీటీని షేక్ చేస్తోంది. మీరు ఇంకా ఆ మూవీ చూడకపోవడం నిజంగా మిస్టేక్ అనే చెప్పాలి. ఏవేవో సినిమాలు చూసే బదులు.. మీ భార్యతో కలిసి ఈ చిత్రాన్ని తిలకిస్తే.. మీ మధ్య ఉన్న అరమరికలు ఇట్టే పోతాయి. మరి.. ఆ సినిమా ఏదో చూద్దాం.

సాధారణంగా ఒక్కో సినిమాకి ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. కొన్ని సినిమాలకు మాత్రం యూనివర్సల్ ప్రాబ్రమ్స్ మీద తెరకెక్కిస్తూ ఉంటారు. అలాంటి ఒక మూవీనే ఇది కూడా. ఈ సినిమాలో ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆ తర్వాత ఎలాంటి గొడవలు పడ్డారు? ఎంత రచ్చ చేశారు? వీళ్ల గొడవలు ఇంట్లో వారికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి? అనే పాయింట్స్ తో సాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య వచ్చే సీన్స్ మీకు సినిమా అయిపోయిన తర్వాత కూడా మైండ్ లో నుంచి పోవు.

అంతేకాకుండా ఈ సినిమాలో చాలా వరకు కథను, సీన్స్ ని ప్రతి ఒక్కరి వారి జీవితానికి రిలేట్ చేసుకోవచ్చు. అరె మనకు కూడా ఇలాగే జరిగిందే అనే ఒక ఆలోచన కలగకమానదు. అయితే మీకు ఈ సినిమా చూస్తున్నంతసేపు అక్కడి భార్యాభర్తలు ఎలా ఫీలైతే మీరు కూడా అలాగే ఫీలవుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో వచ్చే కామెడీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. హీరో- హీరోయిన్ ఇద్దరి మధ్య దాదాపుగా కామెడీ అంతా ఉంటుంది. ఆ సీన్స్ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అయితే ఇందులో యాక్ట్ చేసింది ఎవరో కాదు.. విక్కీ కౌశల్- సారా అలీ ఖాన్.

ఈ మూవీ మరేదో కాదు.. ఇటీవల విడుదలైన జర హట్కే- జర బచ్కే సినిమా. ఈ సినిమా మొత్తం ఒక కొత్త జంట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీకు- మీ భార్యకు గనుక గొడవలు జరుగుతూ ఉంటే ఈ మూవీని కలిసి చూసేయండి కచ్చితంగా కాస్త అయినా అవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ మూవీలో హీరో- హీరోయిన్ ఇద్దరూ విడాకుల దాకా వెళ్తారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నా కూడా విడాకుల కోసం పోరాడుతూ ఉండటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ సినిమా అయినా కూడా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి