iDreamPost
android-app
ios-app

OTT Release: OTTలోకి అవార్డు విన్నింగ్ థ్రిల్లర్ మూవీ! కానీ చిన్న కండిషన్..

  • Published Feb 02, 2024 | 9:45 PM Updated Updated Feb 02, 2024 | 9:45 PM

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు గెలుచుకున్న సూపర్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు గెలుచుకున్న సూపర్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

OTT Release: OTTలోకి అవార్డు విన్నింగ్ థ్రిల్లర్ మూవీ! కానీ చిన్న కండిషన్..

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు అవార్డులు గెలుచుకున్న సూపర్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగనో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం వచ్చింది. కాకపోతే.. ఈ సినిమా చూడటానికి ఓ చిన్న కండిషన్ ఉంది. మరి ఆ కండిషన్ ఏంటి? ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మనోజ్ బాజ్ పాయ్.. ఇండియాలో ఉన్న విలక్షణమైన నటుల్లో ఒకడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా మనోజ్ బాజ్ పాయ్ నటించిన చిత్రం ‘జొరమ్’. దేవాశిష్ మకీజా డైరెక్షన్ లో సర్వైవల్ థ్రిల్లర్ గా తెరెకెక్కింది. గతేడాది డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం గెలుచుకుంది. ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం(క్రిటిక్స్), ఉత్తమ కథ అవార్డులను సొంతం చేసుకుంది.

దీంతో జొరమ్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూడసాగారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. స్ట్రీమింగ్ కు సిద్దమైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతోంది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం హిందీలో జొరామ్ రెంట్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. రూ. 199 చెల్లించి అమెజాన్ ప్రైమ్ లో ఈ థ్రిల్లర్ మూవీని చూడొచ్చు. జార్ఖండ్ గిరిజన ప్రాంతంలో జరిగే ఈ కథ ఆద్యాంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ముందుకుసాగుతుంది. మూవీలో వచ్చే ట్విస్టులు, ములుపులు ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తాయి. అయితే ఈ వీకెండ్ కు సమ్ థింగ్ డిఫరెంట్ సర్వైవల్ మూవీ చూడాలనుకునే వారు ఈ మూవీని తప్పక ట్రై చేయెుచ్చు. మరి రియాలిటీకి దగ్గరగా ఉండే జొరామ్ ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇదికూడా చదవండి: చిరు, రజనీ, పవన్ లా కాదు.. విజయ్ సీఎం కాబోతున్నాడా?