iDreamPost

చిరు, రజనీ, పవన్ లా కాదు.. విజయ్ సీఎం కాబోతున్నాడా?

Joseph Vijay Chandrasekhar: తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణం. ఇప్పటికే పలువురు స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. తాజాగా ఇళయ దళపతి విజయ్ కూడా కొత్త పార్టీ స్థాపించి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.

Joseph Vijay Chandrasekhar: తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణం. ఇప్పటికే పలువురు స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. తాజాగా ఇళయ దళపతి విజయ్ కూడా కొత్త పార్టీ స్థాపించి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.

చిరు, రజనీ, పవన్ లా కాదు.. విజయ్ సీఎం కాబోతున్నాడా?

రాజకీయం.. ఈ పేరు ప్రతి ఒక్కరి తెలుసు. అంతేకాక దీనికి గురించి అందరూ అనేక రకాలుగా కూడా మాట్లాడుకుంటారు. ఇక ఇందులోకి దిగి ఎంతో మంది ప్రజల కోసం పోరాడుతుంటారు. కారణం..రాజకీయం అనేది నిత్య రణరంగం. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ.. తాము గెలిచేందుకు వ్యూహాలు రచించాలి. ఇలాంటి పొలిటికల్ వార్ లోకి ఎంతో మంది దిగారు. వారిలో కొందరు విజయం సాధించగా..మరికొందరు వెనకడుగు వేశారు. రాజకీయాల్లోకి సినీరంగానికి చెందిన వారు కూడా వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. కేవలం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులుగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలోకి తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరి.. ఆస్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కోలీవుడ్ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుక్రవారం విజయ్ ఓ కొత్త పార్టీని ప్రకటించాడు. ఆయన పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తానంటూ వెల్లడించాడు విజయ్. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోంది, అవినీతి నిర్మూలనే తన ధ్యేయమని, 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అంటూ విజయ్ చెప్పాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విజయ్ గురించి ఎంత చెప్పిన చాలా తక్కువే. కారణం.. అతి సామాన్యమైన వ్యక్తి స్థాయి నుంచి ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిరిగారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడులో విజయ్ క్రేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా దాటేసింది. డబ్బింగ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన విజయ్.. ఎంతో కష్టపడి, కృషి చేసి.. ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు. ఇప్పుడు ఈ ఇళయ దళపతి తమిళనాట బీభత్సమైన క్రేజ్ తో దూసుకెళ్తున్నాడు.

ఇక ఇండస్ట్రీ పరంగా విజయ్  క్రేజ్ చెప్పాలంటై.. సౌత్ ఇండియాలోనే టాప్ హీరో అంటేనే విజయ్. మిగిలిన హీరోలు దేశ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు..విజయ్ కేవలం తమిళనాడులోనే  రాబడుతుంటారు. కేవలం ఒక ప్రాంతీయ ఇండస్ట్రీ నుంచి సింపుల్ గా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్ట కలిగే సత్తా హీరో విజయ్ మాత్రమే సొంతం. ఇక ఆయన రేంజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ చేసిన విజయ్.. నాలియ తీర్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. అనతి కాలంలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. స్నేహితుడు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ స్టార్ నటుడికి..తెలుగు నాట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తుపాకీ, జిల్లా, కత్తి, పులి, పోలీసోడు, అదిరింది, బిగిల్, మాస్టర్, బీట్స్ మూవీలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పాగా వేశాడు.

Vijay thalapathy CM chances high

ఇలా సినిమాతో ప్రేక్షకుల మదిలో కాకుండా..ప్రజాసమస్యలపై పోరాడటం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమిళ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఈక్రమంలోనే శుక్రవారం రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కళగం అనే కొత్త పార్టీ పెట్టారు. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తానంటూ వెల్లడించాడు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తాను ముందుకెళ్తునట్లు విజయ్ చెప్పాడు.

ఇక విజయ్ కరెక్ట్ సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని, ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అవకాశాలను విజయ్ కరెక్ట్ గా వినియోగించుకుంటే.. సీఎం అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే.. ఇక్కడ సినిమాలు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది గతంలోనూ జరిగింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎం అయ్యారు. ఆయన తరువాత కరుణా నిధి, జయలలిత ఇలా.. పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు.

తమిళనాడులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ జనాలు.. సినిమాల్లో ఆదరించినట్లే..రాజకీయాల్లోనూ నటులను ఆదరిస్తుంటారు. పైన పేర్కొన్నా మాజీ ముఖ్యమంత్రులే అందుకు ఉదాహరణ. అయితే ఏపీలో మాత్రం తమిళనాడు విధానం కనిపించదు. కేవలం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విషయంలోనే ఆ  సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా కాస్తా ప్రభావం చూపించినప్పటికీ..నిలదొక్కోలేక పోయారు.

కొంతకాలం క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వెనకడుగు వేశారు. ఏపీలో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఆశించిన స్థాయి ప్రభావం చూపలేక పోయారు. అయితే విజయ్ వీళ్లందరికి భిన్నమని, అలానే పరిస్థితులు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ఏ పార్టీకి వరుసగా రెండో సారి అధికారం ఇవ్వలేదు. కేవలం జయలలితకు మాత్రం ఒక్కసారి ఆ అరుదైన రికార్టు దక్కింది. ఇలా అక్కడి సంప్రదాయం ప్రకారం చూసినట్లు అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుంది.

ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో చీలికలు, అసంతృప్తులతో గందరగోళంగా ఉంది. ఇలాంటి తరుణంలో విజయ్ రావడం.. ఆయనకు మంచి అవకాశమనే టాక్ వినిపిస్తోంది. గట్టిగా పోరాడితే.. 2026 ఎన్నికల్లో విజయ్ సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి అవకాశమే చాలా ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కి వచ్చింది. అయితే ఆ సమయంలో రజనీకాంత్ రాజకీయాల వైపు చూడలేదు. తాజాగా అలాంటి అవకాశం ఇళయ దళపతి విజయ్ కి దక్కింది. మరి.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి