iDreamPost
android-app
ios-app

లాక్‌డౌన్‌ను పొడిగించిన మరో రెండు రాష్ట్రాలు.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ

లాక్‌డౌన్‌ను పొడిగించిన మరో రెండు రాష్ట్రాలు.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ మూడో విడత గడువు నేటితో ముగియనుంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ.. అందుకు సంబంధించిన విధి, విధానాలు 18వ తేదీ లోపు వెళ్లడిస్తామని ప్రకటించారు. దీంతో లాక్‌డౌన్‌ 4.0 ఎప్పటి వరకు ఉంటుంది..? ఎలా ఉంటుంది..? మరిన్ని సడలింపులు ఉంటాయా..? అనే అంశాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరో వైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై పొడిగింపుపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిన్న శనివారం లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, తాజాగా ఈ రోజు మరో రెండు రాష్ట్రాలు అదే బాటలో నడిచాయి. కరోనా నియంత్రణలోకి రాకపోవడంతో లాక్‌డౌన్‌ను 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించారు. తెలంగాణలో ఈ నెల 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్రాలు అన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలే కావడం గమనార్హం. పంజాబ్‌లో కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.