‘వ్యాక్సిన్ వచ్చేదాకా కరోనాతో మనం సహజీవనం చెయ్యాలి’.. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. నిజానికి ఈ కామెంట్లతో దేశంలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు కూడా చేయని ధైర్యం ఆయన చేశారు. ప్రజలు భయపడుతారని తెలిసినా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసినా ఆయన తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు. కానీ అన్ని వైపుల నుంచి జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ హేళన చేస్తూ మాట్లాడారు. […]
మాజీ మంత్రి, టీడీపీ నేత కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారు, తాను కలసిన వారు పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి సూచించారు. కరోనా సెకెండ్ వేవ్‌లో జవహర్ దాని బారినపడ్డారు. టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న జవహర్ ఇటీవల తరచూ పత్రికా సమావేశాలు నిర్వహించారు. నేతలతోనూ భేటీ అయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బడా నేతలు ఉన్నా.. వారందరూ సైలెంట్ అవడమో లేదా […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాలలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాల్లో ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి. కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్‌పూర్ నగరంలో మరోమారు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ నెల […]
కోవిడ్ 19ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ప్రధానమని ఇప్పటికే నిపుణులు తేల్చారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమయ్యాయి. సన్నాహాలు పూర్తయ్యాక నాలుగైదు దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా నిలిచిన మన దేశంలో కూడా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసారు. ఇప్పటికే ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాళ్ళ వద్దకు ఎలా చేర్చాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. దీంతో […]
పది నెలలుగా కరోనా వైరస్ వల్ల సతమతమైన ప్రజలకు.. మరో ముప్పు పొంచిఉన్నట్లు కనిపిస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా న్యూసై్టయిన్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన న్యూ స్ట్రెయిన్ వైరస్.. అక్కడ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పలువురు ఈ వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ కేసు వెలుగులోకి రాగా. తాజాగా […]
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,617 పాజిటివ్‌లు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటి వరకు 89,12,907 పాజిటివ్లను గుర్తించారు. వీరిలో 83,35,109 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 4,46,805 యాక్టివ్ పాజిటివ్ కేసులు దేశంలో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,30,993 మంది కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. పలు రాష్ట్రాల్లో బైటపడుతున్న కోవిడ్పాజిటివ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. వాతావరణంలో వచ్చిన […]
ఎలాంటి తారతమ్యాలు లేకుండా అజాగ్రత్తగా ఉన్న వారిని కరోనా వైరస్ చుట్టుముడుతోంది. కరోనా కట్టడిలో ఉన్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందితోపాటు సామాన్యులు, ధనవంతులు, సాధారణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, కార్యాలయ, వ్యక్తిగత సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు వైరస్ సోకినట్లు నిర్థారణ […]
తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీకి కరోనా పాసిటివ్ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతునారు. పరీక్షలు చేసుకోగా సోమవారం కరోనా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ఎస్కార్ట్ వాహనం లోని ఒకరికి పాజీటీవ్ వచ్చింది. అయినప్పటికీ ఆ మర్నాడు జరిగిన హరిత హారం కార్యక్రమంలో హోమ్ మంత్రి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. దీంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే తెలంగాణలోని […]
ఒక్కరోజులో 19,459 పాజిటివ్ కేసులు – 380 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 17 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,48,318 కి చేరింది. అంతేకాకుండా […]
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శంకర్ సింగ్ వాఘేలా ప్రజాశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు […]