iDreamPost
android-app
ios-app

జూనియర్ ఎన్టీఆర్ కోసం ఖల్ నాయక్ ?

  • Published Apr 16, 2020 | 5:00 AM Updated Updated Apr 16, 2020 | 5:00 AM
  • Published Apr 16, 2020 | 5:00 AMUpdated Apr 16, 2020 | 5:00 AM
జూనియర్ ఎన్టీఆర్  కోసం ఖల్ నాయక్ ?

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తో ఇంట్లోనే ఆర్ఆర్ఆర్ కు డబ్బింగ్ చెబుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా లీకవుతున్న ఇంకో అప్ డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేయడం ఖాయం. దాని ప్రకారం నిన్నటి తరం ఖల్ నాయక్ అభిమానులు ముద్దుగా సంజు దాదా అని పిలుచుకునే సంజయ్ దత్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్.

అయితే ఆ రోల్ తాలూకు ఎలాంటి డీటెయిల్స్ ఇంకా బయటికి రావడం లేదు. సంజయ్ దత్ నటిస్తే నిజంగానే ఈ ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా లెవల్ లో మంచి వెయిట్ వస్తుంది. ఆ లోగా ఎలాగూ ఆర్ఆర్ఆర్ తో ప్రభాస్ తరహాలో జూనియర్ కూ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఉంటుంది కాబట్టి బిజినెస్ పరంగానూ చాలా హెల్ప్ అవుతుంది. సంజయ్ దత్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ఒకటే సౌత్ లో చేసిన ప్రాజెక్ట్. దీనిలో తన వంతు భాగం షూటింగ్ పూర్తి చేశాడు. ఒకవేళ త్రివిక్రమ్ మూవీ ఒప్పుకుంటే దసరా తర్వాత షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ బాలీవుడ్ ఆర్టిస్టులను వాడుకోవడంలో మంచి నేర్పరి.

అత్తారింటికి దారేదిలో బోమన్ ఇరానీ, అల వైకుంఠపురములో సచిన్ కెడ్కర్, అతడులో సోను సూద్, జల్సాలో ముఖేష్ రిషి ఇలా ఆయా నటులకు కెరీర్ బెస్ట్ పాత్రలు తన సినిమాల్లోనే ఇచ్చాడు. ఇక సీనియర్ స్టార్ అయిన సంజయ్ దత్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో వేరే చెప్పాలా. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్టు తెలిసింది. హీరోయిన్ ఇతర టెక్నికల్ టీమ్ విషయంలో ఇంకా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండున్నర ఏళ్లుగా తారక్ ను చూడక ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు పలకరించబోతున్నాయి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom