Idream media
Idream media
దేశంలోగాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ప్రగతి సాధించాలంటే పాలనా వికేంద్రీకరణ అత్యావశ్యం. అన్ని సంస్థలు , అన్ని వ్యవస్థలు ఒకే చోట కుప్పబోసినట్లుంటే మిగతా ప్రాంతాలు ఎన్నేళ్లయినా వెనుకబాటులోనే ఉంటాయి. ఆ పరిస్థితి మారాలన్నా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా పరిపాలనా విభాగాలు వేర్వేరు చోట్ల ఉండడమే సముచితము. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సహసోపేతం, మిగతా వారికి మార్గదర్శకం అని అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ పేర్కొంది.
తాజాగా ప్రచురితమైన తన కథనంలో రాయిటర్స్ పలు అంశాలను ఉదాహరణలతో ప్రస్తావించింది.
విశాఖపట్నం లో పరిపాలనా రాజధానిని, కర్నూలులో హైకోర్టు ను, అమరావతిలో శాసన సభను నిర్వహించడం వల్ల అన్ని ప్రాంతాలకూ సముచిత ప్రాధాన్యం దక్కినట్లు అవుతుందని. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ,విద్యాసంస్థలు రాష్ట్రం మొత్తం ఏర్పాటయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అలాకాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు , సంస్థలు మొత్తం అప్పటి రాజధాని హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి. దీనివల్ల గ్రామాల నుంచి ఉపాధికోసం వలసలు వచ్చేవాళ్ళతో నగరం కిక్కిరిసిపోయింది. ఒకే రాజధాని ఉంటే ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల
అన్నిచోట్లా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మూడుప్రాంతాల్లోనో అభివృద్ధి సాధ్యమవుతుంది..వాస్తవానికి భారత్ లో మూడు రాజధానుల అంశం ఏ రాష్ట్రాల్లోనూ లేదు. కానీ కాశ్మీర్ వంటి రాష్ట్రాలకు వేసవి కాలంలో ఒక రాజధాని,చలికాలంలో ఇంకో రాజధాని ఉంటుంది కానీ ఇలా వినూత్నంగా మూడు రాజధానులు ఏర్పాటు అనేది వినూత్న ఆలోచన.
2014లో రాష్ట్ర విభజన తరువాత పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు అమరావతి వద్ద 33,500 ఎకరాల్లో రాజధాని ఏర్పాటుకు తలపెట్టగా దీన్ని ఈఏఎస్ శర్మ వంటి మేధావులు, ఉద్యమకారులు కూడా వ్యతిరేకించారు.
విపరీతంగా జనాభా పెరిగిపోయి ముంబయి , ఢిల్లీ, కోల్కతా వంటి మహానగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం కష్టం అవుతోంది. ఇలాంటి తీవ్రమైన సమస్యలకు , భవిష్యత్ అవసరాలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానం చక్కని పరిష్కారం చూపుతుంది. అయితే బ్రెజిల్, మయన్మార్ వంటి దేశాలు జనాభా రద్దీని తగ్గించడానికి తమ రాజధానులను వరె చోటికి మార్చడానికి ప్రయత్నించగా ఆశించిన ఫలితాలు రాలేదు. “అయితే మలేషియా, బిలివియా , చీలి, నెదర్లాండ్స్ వంటి దేశాలకు రెండేసి రాజధానులు ఉండడంతో వారికి కొంత ఉపశమనం లభించింది. అయితే దక్షిణాఫ్రికా కు కూడా ఇదే విధానం అమలు చేస్తోంది . అదే పద్ధతి మనమూ పాటించి అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేద్దాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం భారత్ లో కోటి జనాభా దాటిన నగరాలు ఐదు ఉండగా 2030 నాటికి మరో 2 నగరాలు ఈ జాబితాలో చేరతాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. పెద్దనగరాలు ప్రగతికి ప్రతీకలుగా ఉంటాయి కానీ అదే సమయంలో పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయి.అందుకే ఇలాంటి సమస్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం అన్నిటా ఆచరణీయం. ఇది కొత్త ప్రగతికి బాటలు వేస్తుంది ..మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అని రాయిటర్స్ కథనంలో వివరించింది.