తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీ నుంచి మాజీ, తాజా ప్రజా ప్రతినిధులు అధికార వైసిపిలోకి క్యూ కడుతున్నారు. రాయలసీమతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలోని బలమైన నేతలు టీడీపీని వీడుతున్నారు. ముఖ్యంగా సీమలో వైఎస్సార్ కడప జిల్లాతో మొదలైన ఈ వలసలు ఇతర జిల్లాలకు పాకుతోంది. తాజాగా ఈ రోజు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. 1994 శాసన సభ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. తాజాగా జగన్ బాట లోనే ఉత్తరాఖండ్ లోని బిజెపి ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా “గెర్సాయిన్” ని ఎంపిక చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ హై కోర్ట్ నైనిటాల్ లో కొనసాగుతుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉత్తరాఖండ్ కు కూడా […]
దేశంలోగాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ప్రగతి సాధించాలంటే పాలనా వికేంద్రీకరణ అత్యావశ్యం. అన్ని సంస్థలు , అన్ని వ్యవస్థలు ఒకే చోట కుప్పబోసినట్లుంటే మిగతా ప్రాంతాలు ఎన్నేళ్లయినా వెనుకబాటులోనే ఉంటాయి. ఆ పరిస్థితి మారాలన్నా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా పరిపాలనా విభాగాలు వేర్వేరు చోట్ల ఉండడమే సముచితము. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సహసోపేతం, మిగతా వారికి మార్గదర్శకం అని అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ పేర్కొంది. […]
కధలోకి వెళితే ..1996 తమిళనాడు శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.తమిళనాడు లో కాంగ్రెస్ లోకి రజనీకాంత్ ని తీసుకొస్తొన్నాను అని అప్పటి తమిళ ప్రదేశ్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు మూపనార్ , ప్రధానమంత్రి పివి నరసింహారావు వద్ద ఒక ప్రతిపాదన చేశారు.ఆ ప్రతిపాదనను అంగీకరించినట్లే అనుకోని రజనీ-పివి ల సమావేశం జరిగింది.ఆ సమావేశ అనంతరం మూపనార్ ను పిలచిన పివి-“నాకెందుకో రజనీ కాంగ్రెస్ తో వస్తాడనిపించడం లేదు.మీరెటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండండి.అవసరమైతే మరొకసారి మనం అన్నాడిఎమ్ కె […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడాయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రీయసైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనికవీరుల కుటుంబాలసంక్షేమానికి ప్రకటించిన కోటిరూపాయల చెక్కును అందచేస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా అమరసైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు మధ్యాహ్నం విజ్ఞాన భవన్ లోజరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులోపాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయనాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈకార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.విద్యార్థులసందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ […]
మహారాష్ట్ర రాజకీయాలంటే.. వినిపించే పార్టీ పేర్లు.. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ. ఈ పార్టీలు ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో మాత్రం సీపీఎం కంచుకోటగా ఉంది. దేశ వ్యాప్తంగా ఓటమి చవిచూస్తున్న సీపీఎంకు అక్కడ మాత్రం గత 60 ఏళ్లుగా విజయమే తప్పా ఓటమనేదే లేదు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. పాల్గర్ జిల్లా దహాను నియోజకవర్గంలోని తలసరి తహసిల్ పంచాయత్ సమితి ( తెలుగు రాష్ట్రాల్లో మండల పరిషత్)ని సీపీఎం కైవసం చేసుకుంది. […]
చైర్మన్ గారు మీ సెలెక్ట్ కమిటి నిర్ణయాన్ని నేను అమలు పర్చలేను అని మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు రెండుసార్లు దస్త్రాన్ని చైర్మన్ కు తిప్పి పంపటంతో రాజ్యాంగ సంక్షోభం అంటూ పత్రికలూ వార్తలు రాసిన నేపథ్యంలో శాసనమండలి కార్యదర్శి సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని ఎందుకు వెనక్కి పంపాడు? మండలి చైర్మన్ కు రాసిన నోట్ లో కార్యదర్శి “సభను నడపడంలో ఛైర్మన్‌కు సలహాలు ఇవ్వటం,గైడ్ చెయ్యటం,సహాయపడటం నా బాధ్యత. నిబంధనల అమలులో లోపాలు,పొరపాట్లు ఉంటె వాటిని చైర్మన్ కు […]
ప్రతి శాసనసభ, శాసనమండలి సమావేశాల అనంతరం సాధారణంగా జరిగే తంతే ప్రొరోగ్. కానీ ఎప్పుడోసారి మాత్రమే మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజనకు ముందు 2013లో కొన్ని నెలల పాటు ప్రొరోగ్ అంశం హడావుడి చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు.. కాదు ఇన్నేళ్లకు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రాభివృద్ధికి ఉద్ధేశించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం.. దీంతో మండలినే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. […]
ఢిల్లీ శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏడు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. ఉదయం నుంచి ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే సాగింది. అందరూ ఊహించనట్లుగానే ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండంకెల సంఖ్య చేరుకుంటుందని ఆశించిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ ఫలితాలు […]
ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం ఏడు సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి తన స్థానాలను స్వల్పంగా పెంచుకుంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ బీజేపీ దాదాపు 15 నుంచి 20 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. ఒకానొక దశలో ఆప్, బీజేపీ మధ్య 27 స్థానాల్లో హోరా హోరీ […]