క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై పదే పదే ఆరోపణలు చేస్తు, ఎల్లోమీడియాలో రాయిస్తు చంద్రబాబు కాలం గడిపేస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలైనా, ఎల్లోమీడియాలో అచ్చవుతున్న రాతలైనా అబద్ధాలే అన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇదే పద్దతిలో రాజకీయాలు చేసుకుంటూ పోతే చివరకు చంద్రబాబు నిజం చెప్పినా జనాలు నమ్మలేని స్ధితి తెచ్చుకుంటున్నాడు. చంద్రబాబు వ్యవహార శైలిపై అందరికీ […]
ఇప్పుడు బ్యానర్ అయినది.. మరికొద్ది నిమిషాలకు లోపలిపేజీకి వెళ్లిపోతుంది.. అనేది పత్రికా రంగంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మాట. ఇది 100 శాతం వాస్తవం కూడా కాలం గడిచేకొద్దీ పత్రికల్లో వార్తల ప్రాధామ్యాలు మారిపోతూ ఉంటాయి. ఇందుకు ఏ అంశం కూడా మినహాయింపు కాదు. అయితే కొన్ని అంశాలను కావాలని వెలుగులో ఉంచడం కోసం ప్రత్యేకంగా పనిగట్టుకుని కథనాలు ప్రచురించడం ఈ కోవ కిందకు రాదు. అలాంటి అంశమే అమరావతి. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన మొదలైన అమరావతి ఉద్యమం క్షేత్రస్థాయిలో […]
కార్యనిర్వాహక విభాగాలను విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల లోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు పది రోజులకు వాయిదా వేసింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి […]
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పే సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినీ బాలతో సహా వైఎస్సార్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమైందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే అనుచరులతో కలసి ఆమె విజయవాడకు చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తన […]
టీడీపీ నేటి దుస్థితికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు అహంకార పూరితంగా వ్యవహరించిన తీరే కారణం విశ్లేషకుల అభిప్రాయం. ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారన్నది నానుడి. అధికారం అండగా చెలరేగిపోయి ఎన్నో అక్రమాలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారు కుల, మత, ప్రాంత, బంధుప్రీతి లేకుండా పనిచేయాలి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారు. ఇదే ప్రజలకు విరక్తి కలిగించింది. అందుకే చిత్తుగా ఓడించారు. చంద్రబాబు వ్యవహార శైలి ఆ పార్టీ నాయకులకూ […]
రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశాక అమరావతి ప్రాంతంలో రైతులు కొందరు నిరసన దీక్షలు మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొందరు హర్షం వ్యక్తం చేశారు. అంతకు మించి ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. రాజధాని నగరం ఒక చోట ఉన్నా, మూడు చోట్ల ఉన్నా సగటు పౌరుడి జీవితంలో పెద్ద తేడా కనిపించదు కాబట్టి ఆ నిర్లిప్తత. అయితే తెలుగుదేశం శ్రేణులు, ముఖ్యంగా ఆ పార్టీ […]
హాయిగా సినిమా షూటింగ్లో ఉన్న పవన్‌కల్యాణ్‌కి జగన్ తలనొప్పి తెచ్చి పెట్టాడు. రాజకీయాల్లోకి రావడం అంటే భేతాళుడిని తెచ్చి భుజం మీద వేసుకున్నట్టే. తలలు తినేస్తాడు. జనసేనని లాగడం అంత ఈజీ కాదని తెలిసే పవన్ బీజేపీతో చేరిపోయాడు. ఎవరినైనా నిలదీస్తామంటూ ఢిల్లీలో చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సరే, ఆయన పార్టీ ఆయన ఇష్టం. కాకపోతే ఇద్దరు ఈతరాని వాళ్లు ఒకర్నొకరు పట్టుకుని నీళ్లలోకి దూకారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చాయి. గ్రామాల్లో ఎలాగూ ఇద్దరికీ బలం […]
ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడీ అన్నట్లు.. ఆది నుంచీ బీజేపీలో ఉన్న నాయకులు కన్నా తమ మాటే ఫైనల్ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లినా సుజనా వ్యవహార శైలి, మాటలు అన్నీ టీడీపీ నేతగానే ఉంటోందన్న విమర్శలున్నాయి. అసలు ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీ కి చెందిన నలుగురు ఎంపీలు బీజీపీలో చేరారో అందరికీ తెలిసిన విషయమే. ఏ క్షణంలోనైనా వారు తిరిగి టీడీపీ గూటికి […]
మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం హైకోర్టును అక్కడకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. ఇక విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటుకు అనువైన భవనాలు, నిర్మాణానికి భూముల అన్వేషణ కొనసాగిస్తోంది. సచివాలయాన్ని మధురవాడలోని మిలీనియం టవర్స్‌లో ఏర్పాటు చేయాలని తొలుత భావించినా.. అక్కడ ఐటీ కంపెనీలు ఉండడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు […]
అమరావతి పేరుమీద పోరాటం నేటికి 80వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయగానే రాజధాని అమరావతిలోని 29 గ్రామాల రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. అమరావతి నగరాన్ని ప్రతిపాదించిన చంద్రబాబు ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని పూర్తిగా భుజాన వేసుకున్నాయి. గడచిన 80 రోజులుగా అమరవాటిపేరుతో జరుగుతున్న ఉద్యమం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఒక సామాజిక వర్గానికి చెందిన రైతుల భాగస్వామ్యంతోనే నడుస్తోంది. రాజధానికి 29 వేలమంది రైతులు భూములు […]