iDreamPost
రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
iDreamPost
ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీతో పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్న మాస్ మహారాజా రవితేజ ఆశలన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ధమాకా మీదే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ధమాకా మీద అన్ని హోప్స్ పెట్టుకున్నారు. సినిమా చూపిస్త మావా,నేను లోకల్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఆ తర్వాత హలో గురు ప్రేమ కోసమేతో యావరేజ్ అందుకున్న త్రినాథరావు నక్కిన దీనికి దర్శకుడు. దసరా విడుదల అనుకున్నారు కానీ ఘోస్ట్, గాడ్ ఫాదర్ లు వస్తున్నాయి కాబట్టి ఛాన్స్ తక్కువే.
జయాపజయాలతో సంబంధం లేకుండా రవితేజ చేస్తున్న సినిమాల దూకుడు మాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఎవరూ ఊహించని ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఎడిటర్ గా చాలా పేరుతో పాటు మంచి అనుభవమున్న కార్తీక్ ఘట్టమనేని చెప్పిన ఒక ఫాంటసీ లైన్ బాగా నచ్చడంతో మాస్ రాజా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈగల్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. బడ్జెట్ కూడా భారీగానే కాబోతోంది. వీటికన్నా ముందు రవి పూర్తి చేయాల్సిన కమిట్ మెంట్లు ఉన్నాయి. ధమాకా ప్రమోషన్ల వరకు ఈ టీమ్ తో ఉండాలి. ఆ తర్వాత చిరంజీవితో కలిసి చేస్తున్న వాల్తేర్ వీరయ్య కోసం కేటాయించిన డేట్లలో దాన్ని వేగంగా పూర్తి చేయాలి.
ఇప్పటిది దర్శకుడు బాబీ కొంత భాగం పూర్తి చేశాడు కూడా. సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర కూడా సెట్స్ మీదుంది. ఇవి కాకుండా టైగర్ నాగేశ్వర్ రావు చిత్రీకరణ అతి త్వరలో మొదలుపెట్టబోతున్నారు. శ్రీవాస్ కో ప్రాజెక్ట్ మాటిచ్చారు. దానికీ రంగం సిద్ధమయ్యింది. ఇవన్నీ ఫినిష్ చేశాక ఈగల్ సంగతి చూడాలి. అంటే 2023 కన్నా ముందు స్టార్ట్ చేసే అవకాశం లేనట్టే. కార్తీక్ ఘట్టమనేని అంత ఎగ్జైట్ అయ్యే లైన్ ఏం చెప్పాడో చూడాలి. ఒకపక్క యూత్ హీరోలు ఏడాది ఒకటి రెండు సినిమాలు చేయడానికే కిందా మీద పడుతుంటే అయిదు పదుల వయసు దాటిన రవితేజ ఈ రేంజ్ స్పీడ్ తో పరుగులు పెట్టడం విశేషం. కాకపోతే క్వాలిటీ చెక్ చేసుకోవడం అవసరం