iDreamPost
android-app
ios-app

ఆంజనేయులు మూవీలో.. కెమెరామేన్ గా నటించిన ఈ హీరోని గుర్తుపట్టారా?

  • Published Aug 31, 2024 | 5:30 AM Updated Updated Aug 31, 2024 | 5:30 AM

రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆంజనేయులు మూవీ కూడా ఒకటి. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశంలో కెమెరామెన్ గా కనిపిస్తున్న ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆంజనేయులు మూవీ కూడా ఒకటి. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశంలో కెమెరామెన్ గా కనిపిస్తున్న ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

  • Published Aug 31, 2024 | 5:30 AMUpdated Aug 31, 2024 | 5:30 AM
ఆంజనేయులు మూవీలో.. కెమెరామేన్ గా నటించిన ఈ హీరోని గుర్తుపట్టారా?

మాస్ మహారాజ్ రవితేజ.. ఇటీవలే ఈయన మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందకు వచ్చిన సంగతి తెలసిందే. అయితే ఈ మూవీ ఆగస్టు 15న థియటేర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది కానీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశ మిగిలింది. కానీ, రవితేజ మాత్రం తన కెరీర్ లో సక్సేస్, ఫెయిల్యూర్స్ ను పట్టించుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తునే ఉంటారు. ఈ క్రమంలోనే.. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా అలరించారు. ముఖ్యంగా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తగా పరిచయమవుతుంటారు.

ఇదిలా ఉంటే.. రవితేజ నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ‘ఆంజనేయులు’ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాను పరుశురామ్ దర్శకత్వం వహించారు. ఇక ఇందులో హీరోయిన్ గా నయనతార నటించింది. అయితే ఈ సినిమాలో అప్పటిలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సేస్ అందుకుంది. కాగా, ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా, తమన్ సంగీతంను అందింంచారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్, బ్రహ్మానందం, మాళవిక కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కెమెరామెన్ గా కనిపిస్తున్న ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ స్టార్ హీరో. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

VJD

హీరో రవితేజ, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఆంజనేయులు. అయితే ఈ సినిమాలో ఓ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఇక అందులో ఓ స్టార్ హీరో కెమరామెన్ గా కనిపిస్తున్నాడు ఎవరో గుర్తుపట్టారా.. ఆయన మరెవరో కాదు.. స్టార్ హీరో ‘విజయ్ దేవరకొండ’. అయితే ఈ యంగ్ హీరో మొదటిలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేశాడు. ఈ క్రమంలోనే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరోగా ప్రేక్షకులకు పరిచయమైయ్యాడు. ఇక ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి మూవీలో నటించి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇకపోతే ప్రస్తుతం రవితేజ ఆంజనేయులు సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్ కెమెరామోన్ గా కనిపించడం అనేది నెట్టింట వైరల్ గా మారింది. కాగా, ఈ ఫోటో చూసిన నెటిజన్స్ విజయ్ చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారంటు పలు కమెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం  ఆంజనేయులు మూవీలో కెమెరామెన్ గా  వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş