iDreamPost
android-app
ios-app

Harish Shankar: మిస్టర్ బచ్చన్ రిజల్ట్.. రెండు కోట్లు వెనక్కి ఇచ్చిన హరీష్ శంకర్!

  • Published Sep 04, 2024 | 12:59 PM Updated Updated Sep 04, 2024 | 12:59 PM

Harish Shankar Returns 2 Crores Remuneration: హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఇటీవలే వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో నష్టాలు చవిచూశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తన పారితోషికంలో రెండు కోట్లు వెనక్కి ఇచ్చేశాడు.

Harish Shankar Returns 2 Crores Remuneration: హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఇటీవలే వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో నష్టాలు చవిచూశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తన పారితోషికంలో రెండు కోట్లు వెనక్కి ఇచ్చేశాడు.

Harish Shankar: మిస్టర్ బచ్చన్ రిజల్ట్.. రెండు కోట్లు వెనక్కి ఇచ్చిన హరీష్ శంకర్!

సాధారణంగా సినిమా రిజల్ట్ లో ఏదైనా తేడా కొడితే.. హీరోలు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడమో.. లేక అందులో సగం తిరిగి ఇచ్చేయడమో చేస్తుంటారు. ఇలాంటి వార్తలు మనం చాలానే చూశాం. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఇలాంటి గొప్ప పనే చేసి నిర్మాతల డైరెక్టర్ అనిపించుకున్నాడు. మాస్ మహారాజ రవితేజతో తీసిన మిస్టర్ బచ్చన్ అనుకున్న రేంజ్ లో హిట్ సాధించలేదు. దాంతో ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దాంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధించలేకపోయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తన గొప్ప మనసును చాటుకుంటూ రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ను వెక్కి తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మరికొంత వెనక్కి ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా.. ఇలా సినిమా వల్ల నష్టపోతే.. పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం గొప్ప విషయం అని హరీష్ శంకర్ ని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇక ఇదే బాటలో రవితేజ నడుస్తాడని కొందరు భావిస్తున్నారు. కాగా.. 2018లో హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రైడ్’కి మిస్టర్ బచ్చన్ రీమేక్. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, ఇలియానాలు నటించారు. మరి మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం కారణంగా 2 కోట్ల పారితోషికాన్ని వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.