iDreamPost
android-app
ios-app

రంగ్ దే కాంబినేషన్ మరోసారి

  • Published May 04, 2020 | 9:46 AM Updated Updated May 04, 2020 | 9:46 AM
  • Published May 04, 2020 | 9:46 AMUpdated May 04, 2020 | 9:46 AM
రంగ్ దే కాంబినేషన్ మరోసారి

భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నితిన్ నెక్స్ట్ రిలీజ్ రంగ్ దే కీలక భాగం షూటింగ్ బాలన్స్ ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల బ్రేక్ వేసుకుంది. యూరోప్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పట్లో విదేశాల్లో అనుమతులు దొరకడం కష్టంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ మిస్టర్ మజ్నులతో ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దీనికి దర్శకుడు కావడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరొయిన్. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నితిన్, కీర్తిల జంట బాగుందని ప్రశంసలు కూడా వచ్చాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రచయిత, రౌడీ ఫెలో-చల్ మోహనరంగా చిత్రాల దర్శకుడు కృష్ణ చైతన్య రూపొందించబోయే పవర్ పేటలో హీరొయిన్ గా కీర్తి సురేష్ నే ఓకే చేశారట. రెండు భాగాలుగా పవర్ పేటను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరొయిన్ పాత్రకు పెర్ఫార్మన్స్ పరంగా చాలా స్కోప్ ఉండటంతో కీర్తి సురేష్ తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదట దర్శకుడికి. అందులోనూ సబ్జెక్ట్ బాగా నచ్చడంతో కీర్తి ఎక్కువ ఆలోచించలేదని తెలిసింది.

రంగ్ దేతో ఎలాగూ నితిన్ తో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది కాబట్టి పవర్ పేటలో మరోసారి రిపీట్ చేయొచ్చు. ఏలూరు ప్రాంతంలో జరిగిన కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా పవర్ పేట రూపొందుతుందట. అయితే నితిన్ డైరీ చాలా టైట్ గా ఉంది. రంగ్ దేని పూర్తి చేయడంతో పాటు అందాధున్ రీమేక్, చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కమిట్ అయ్యాడు. పవర్ పేట వీటి తర్వాత వస్తుందా లేక మధ్యలో ఏదైనా స్లాట్ తీసుకుంటుందా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాగా తగ్గించేసిన కీర్తి సురేష్ ఇంత ప్రత్యేకంగా నితిన్ సరసన రెండు సినిమాలు
ఒప్పుకోవడం విశేషమే.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom