iDreamPost
android-app
ios-app

షాకింగ్ రోల్ లో పవన్ కళ్యాణ్ ?

  • Published Mar 15, 2020 | 11:44 AM Updated Updated Mar 15, 2020 | 11:44 AM
  • Published Mar 15, 2020 | 11:44 AMUpdated Mar 15, 2020 | 11:44 AM
షాకింగ్ రోల్ లో పవన్ కళ్యాణ్ ?

ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ లో పెట్టేసిన పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన వ్యవహారాలు చక్కదిద్దుతూనే మరోవైపు వీటి కోసం టైం కేటాయిస్తూ యమా బిజీగా ఉన్నాడు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ దాదాపు ఫినిషింగ్ కు వచ్చినట్టే. ఓ ఇరవై శాతం మినహా మొత్తం పూర్తయ్యిందని సమాచారం. ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తాలుకు ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్ వ్యవహారాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి . వీటి తర్వాత పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్ టైనర్ ని ఆశిస్తున్న అభిమానులకు తాను ఒక సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సబ్జెక్టుని డీల్ చేయబోతున్నట్టు ఆ మధ్య హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అయితే అధికారికంగా ప్రకటించే దాక ఏదీ నమ్మలేం కాని తాజాగా వచ్చిన ఓ అప్ డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం పవన్ ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. సిఎం రోల్ అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. గతంలో భరత్ అనే నేనులో మహేష్ బాబు, ఒకే ఒక్కడులో అర్జున్, లీడర్ లో రానా, ముఖ్యమంత్రిలో కృష్ణ ఇలా సిఎం పాత్రల్లో కనిపించి మెప్పించారు.

ముఠామేస్త్రిలో చిరంజీవి మంత్రిగా నటించారు కాని సిఎం కాలేదు. ఇప్పుడు పవన్ అంటే కిక్ మాములుగా ఉండదు. అయితే ఎంత సినిమా అయినా అందులో కచ్చితంగా జనసేన భావజాలం ఉండే అవకాశం లేకపోలేదు. మరి హరీష్ శంకర్ దాన్ని దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నాడా లేక ఇదంతా ఫిలిం నగర్ కు పరిమితమైన ప్రచారమా తెలియాలంటే వేచి చూడాలి. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న హరీష్ శంకర్ హీరొయిన్ సెలక్షన్ తో పాటు టెక్నికల్ టీం ని సెట్ చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. ఇంకో రెండు మూడు నెలలు ఆగితే దీని గురించిన స్పష్టమైన సమాచారం వస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom