iDreamPost
android-app
ios-app

మైత్రి బంధంలో చిక్కుకున్న విడుదల తేదీలు

  • Published Oct 14, 2022 | 2:35 PM Updated Updated Oct 14, 2022 | 2:35 PM
  • Published Oct 14, 2022 | 2:35 PMUpdated Oct 14, 2022 | 2:35 PM
మైత్రి బంధంలో చిక్కుకున్న విడుదల తేదీలు

ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలతో సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాణ సంస్థలకు చాలా చిక్కులొస్తాయి. అందులోనూ విడుదల తేదీకి సంబందించినవి అయితే అభిమానులకు సర్దిచెప్పాల్సింది బోలెడు ఉంటుంది. ఇప్పుడలాంటి ఇరకాటమే మైత్రి మూవీ మేకర్స్ కి వచ్చినట్టుంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య 107 షూటింగ్ పూర్తి కావడానికి అతి దగ్గరలో ఉంది. వచ్చే నెల ఇంకో పది రోజుల షెడ్యూల్ తో గుమ్మడికాయ కొట్టొచ్చని సమాచారం. డిసెంబర్ 23 రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకుని పనులు పూర్తి చేస్తున్నారు కానీ అభిమానులు మాత్రం 2023 సంక్రాంతికే రావాలని పట్టుబడుతున్నారట.

ఇది కాస్తా బాలయ్యకు చేరడంతో ఆయనా అదే సీజన్ అయితే బెటరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదే మైత్రి చిరంజీవితో వాల్తేర్ వీరయ్య చేస్తోంది. బాబీ డైరెక్టర్. తాజాగా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టేశారు. రవితేజ కాంబినేషన్ తాలూకు కీలక పార్ట్ ని దాదాపుగా ఫినిష్ చేసినట్టు తెలిసింది. దీన్ని అఫీషియల్ గానే పొంగల్ రిలీజని ఎప్పుడో నెలల క్రితమే అధికారికంగా ప్రకటించారు. సో ఇప్పుడు వెనక్కు తగ్గితే ఫ్యాన్స్ నుంచి నిరసన సెగలు ఎదురవుతాయి. పైగా మెగాస్టార్ మాస్ మహారాజా కాంబినేషన్ కాబట్టి పండగనే బెస్టని డిస్ట్రిబ్యూటర్లు సైతం అభిప్రాయపడుతున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. మైత్రికి ఇది ముమ్మాటికీ సంకేత స్థితే.

ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో దీపావళికి తేలనుంది. ఆ సందర్భంగానే బాలయ్య టైటిల్ రివీల్, వాల్తేర్ వీరయ్య టీజర్ ని విడుదల చేయబోతున్నారు. వీటిలో ఖచ్చితంగా రిలీజ్ డేట్ ని చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ముందు వస్తారు అనేది ఓపెనైపోతుంది. క్లాష్ అయితే జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే అటుఇటుగా రెండింటికి బయ్యర్లు ఒకటే ఉంటారు. అలాంటప్పుడు కోరిమరీ థియేటర్ల సమస్య తెచ్చే ఈ ఫైట్ కు ఇష్టపడరు. చిరు బాలయ్యలు ఇలా తలపడటం కొత్తేమీ కాదు కానీ ఒకే బ్యానర్ నుంచి ఇలాంటి సమస్య రావడం ఫస్ట్ టైం. మరి ఇద్దరు మిత్రుల మధ్య అండర్ స్టాండింగ్ ఎలా ఉందో ఇంకొక్క వారం ఆగితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş