iDreamPost
iDreamPost
సంక్రాంతి సినిమాల హడావిడి క్రమంగా తగ్గుతోంది. అల వైకుంఠపురములో ఇంకా చాలా సెంటర్స్ లో స్ట్రాంగ్ గానే కొనసాగుతుండగా సరిలేరు నీకెవ్వరుకు డ్రాప్స్ మొదలయ్యాయి. ఇక దర్బార్ ఆల్మోస్ట్ ఫినిష్ కాగా ఎంత మంచివాడవురా ఈదుతోంది. ఇక రేపు డిస్కోరాజా రవితేజ థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. గత ట్రాక్ రికార్డు దృష్ట్యా దీని మీద భారీ బజ్ అయితే లేదు . టాక్ కనక బాగా వస్తే ఆపై పుంజుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
దీని సంగతలా ఉంచితే ఆపై శుక్రవారం నాగ శౌర్య అశ్వద్ధామ రాబోతోంది. ఓ టీజర్ ని విడుదల చేయడం మినహా ఇంకా టీమ్ గట్టి ప్రమోషన్ చేపట్టలేదు. హీరో స్వంత బ్యానర్ కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా భారీగానే తెరకెక్కించారు. విశేషమేమిటంటే నాగ శౌర్యనే అశ్వద్ధామకు కథను అందించడం. దీని ద్వారా రమణతేజను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన అశ్వద్ధామలో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందట. ఈ టైటిల్ కు మహాభారత గాధలోని పాత్రకు లింక్ ఉన్నప్పటికీ దానికన్నా మరొక సినిమాతో కనెక్షన్ ఉంది.
అదే కృష్ణ నటించిన అశ్వద్ధామ. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 30 ఏళ్ళ క్రితం మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఎవరూ ఈ టైటిల్ ని వాడుకోలేదు. ఇప్పుడు నాగ శౌర్య తీసుకున్నాడు. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ శౌర్యకు మళ్ళీ సక్సెస్ అందలేదు. కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల అన్ని నిరాశ పరిచాయి. ఓ బేబీ ఆడింది కానీ పేరంతా సమంతా కొట్టేసింది. సో సోలో హీరోగా ఈ అశ్వద్ధామ హిట్ కావడం చాలా కీలకం. మరి మొదటిసారి కృష్ణ టైటిల్ తో నాగ శౌర్య ట్రై చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి