iDreamPost
android-app
ios-app

రిపీట్ అవుతున్న రంగబలి కాంబో.. ఈసారి అంతకు మించే..

  • Published Mar 11, 2024 | 6:40 PM Updated Updated Mar 11, 2024 | 6:40 PM

Naga Shaurya- Pavan Basam Shetty: రంగబలి సినిమా నాగశౌర్య కెరీర్ లో ఫ్యాన్స్ ని బాగా మెప్పించిన చిత్రం. ఇప్పుడు ఆ మూవీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటున్నారు.

Naga Shaurya- Pavan Basam Shetty: రంగబలి సినిమా నాగశౌర్య కెరీర్ లో ఫ్యాన్స్ ని బాగా మెప్పించిన చిత్రం. ఇప్పుడు ఆ మూవీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అంటున్నారు.

  • Published Mar 11, 2024 | 6:40 PMUpdated Mar 11, 2024 | 6:40 PM
రిపీట్ అవుతున్న రంగబలి కాంబో.. ఈసారి అంతకు మించే..

టాలీవుడ్ లో స్టార్ హీరోలు, స్టార్ హైరెక్టర్స్ ఉంటారు. అయితే వాళ్లు స్టార్స్ కావడానికి లేదా వారికి మంచి పేరు తీసుకురావడానికి కొన్ని సినిమాలు దోహదపడి ఉంటాయి. అలాంటి సినిమాలు అటు హీరో, ఇటు డైరెక్టర్ కెరీర్ లోనే మంచి నంబర్స్ ని అందించి ఉంటాయి. అలాంటి హిట్టు సినిమాలు వచ్చిన తర్వాత మరికొంత కాలానికి అయినా ఆ కాంబో రిపీట్ కావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటారు. సగటు సినిమా అభిమాని కూడా అదే విషయంలో ఆశ పడతాడు. ఇప్పుడు అలాంటి కాంబో టాలీవుడ్ లో మరోసారి రిపీట్ కాబోతోందని చెబుతున్నారు. అదే రంగబలి కాంబో.. కాదు కాదు ‘రంగభలే’ కాంబో.

టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో నాగశౌర్యకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మనోడి సినిమా వస్తోంది అంటే మినిమం గ్యారెటీ అనే ట్యాగును సొంతం చేసుకున్నాడు. అలాంటి నాగశౌర్యకు రీసెం గా హిట్టు తెచ్చిన సినిమా రంగబలి. ఈ మూవీ 2023 జులై 7న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంజి రిజల్ట్ అందుకున్న ఈ సినిమా తర్వాత ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించింది. అలాంటి హిట్టు కాంబో మళ్లీ ఎప్పటికి రిపీట్ అవుతుందో అని నాగశౌర్య ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, వారి గట్టిగా కోరుకున్నారో లేదో.. ఆ హిట్టు కాంబో ఇప్పుడు రిపీట్ కాబోతోందని చెబుతున్నారు. రంగబలి మూవీ చేసిన పవన్ బాసంశెట్టితోనే హీరో నాగశౌర్య తన తర్వాతి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటున్నారు.

నిజానికి రంగబలి కాంబో రిపీట్ అనగానే కొందరు కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్, కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే సినిమాలో అంతా బాగానే ఉన్నా లవ్ స్టోరీ మాత్రం కాస్త లైన్ తప్పినట్లు అనిపిస్తుంది. అంటే మూవీలో లవ్ కి ఇంపార్టెన్స్ తగ్గింది అనే భావన కలుగుతుంది. అయితే నాగౌశౌర్య మాత్రం తన యాక్టింగ్ తో మూవీని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. అందుకే రంగబలి సినిమా అంటే శౌర్య ఫ్యాన్స్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. అలాగే సత్య కూడా తన పాత్రను ఇగదీస్తాడు. కానీ ఎందుకో ఈ కాంబో రిపీట్ వార్తలపై నాగశౌర్య ఫ్యాన్స్ లో కొందరు కంగారు పడుతున్నారు.

అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఈసారి వచ్చే మూవీ రంగబలికి మించి ఉంటుంది అంటున్నారు. కథ, టేకింగ్, యాక్షన్ ఇలా ఏది చూసినా రంగబలికి మరో మెట్టు పైనే ఉంటుందని చెబుతున్నారు. పైగా నౌగశౌర్యకు బాగా సూట్ అయ్యేలా.. రంగబలి పాత్రకు మించిన వేరియేషన్స్, షేడ్స్ తో ఈ పాత్ర ఉండబోతోందని చెబుతున్నారు. మరి.. యాక్షన్ ఎక్కువ ఉంటుందా? కామెడీ ఎక్కువగా ఉంటుందా? మళ్లీ లవ్ స్టోరీతోనే వస్తారా? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి.. రంగబలి కాంబో రిపీట్ కాబోతోంది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş