iDreamPost
android-app
ios-app

కష్టాల్లో నాగశౌర్య కొత్త సినిమా?ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్!

  • Published Jul 22, 2024 | 1:10 PM Updated Updated Jul 22, 2024 | 1:10 PM

Naga Shaurya టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు నాగ శౌర్య. యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ చిత్రాలతో దూసుకెళుతున్నాడు. తాజాగా రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన కన్నడ స్టార్ నటుడు దర్శన్ కు మద్దుతుగా నిలిచి.. వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆయన సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Naga Shaurya టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు నాగ శౌర్య. యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ చిత్రాలతో దూసుకెళుతున్నాడు. తాజాగా రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన కన్నడ స్టార్ నటుడు దర్శన్ కు మద్దుతుగా నిలిచి.. వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆయన సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

  • Published Jul 22, 2024 | 1:10 PMUpdated Jul 22, 2024 | 1:10 PM
కష్టాల్లో నాగశౌర్య కొత్త సినిమా?ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నటుడు నాగ శౌర్య. క్రికెట్ గర్ల్స్ అండ్ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శౌర్య.. ఊహాలు గుసగుసలాడే చిత్రంతో ఫేమ్, నేమ్ తెచ్చుకున్నాడు. ఛలో, అశ్వద్దామ చిత్రాలు తనలోని వర్సటాలిటీని బయటపెట్టాయి. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్, యాక్షన్ చిత్రాలతో దూసుకెళుతున్నాడు.   2023లో రంగబలితో పలకరించాడు. అయితే ఇటీవల చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేదు శౌర్య. ఇప్పుడు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ టాలెంట్. పోలీస్ వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారీ చిత్రాలు కంప్లీట్ అయ్యి.. రిలీజ్ కావాల్సి ఉంది. వీటితో పాటు మరో మూవీ కూడా చేస్తున్నాడు.

ఇటీవల రేణుకా స్వామి హత్య కేసులో నిందితడు, కన్నడ స్టార్ నటుడు దర్శన్‌కు మద్దతు ప్రకటించాడు. కాస్తంత నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అతడి సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న ఓ మూవీ కష్టాల్లో ఉందట. నిర్మాతకు, దర్శకుడికి విబేధాలు రావడంతో.. ప్రొడ్యూసర్ క్విట్ అయ్యాడని తెలుస్తోంది. ఇద్దరు కొత్త వాళ్లే కావడంతో సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. శౌర్య కొత్త సినిమాకు నిర్మాతగా ఓ ఎన్నారై ముందుకు వచ్చాడట. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పేరుతో బాగా ఖర్చు పెట్టించాడట దర్శకుడు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే షూటింగ్ నిమిత్తం రూ. 10 కోట్టు నిర్మాతతో ఖర్చు పెట్టించారట. ఇప్పుడే ఇంతయితే.. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని, థియేటర్లలోకి వచ్చే సరికి భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడిపోయాడట నిర్మాత.

దీంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట సదరు ఎన్నారై ప్రొడ్యూసర్. ఇదిలా ఉంటే మరో నిర్మాతను నాగశౌర్య తీసుకు వచ్చారట. అయితే ఇప్పటి వరకు తాము పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేసి.. సినిమాను నిర్మించాలని గత ప్రొడ్యూసర్ పట్టుబడుతున్నారని సమాచారం. అయితే ఇందుకు దర్శకుడు అంగీకరించడం లేదట. దీంతో ఈ పంచాయతీ కాస్తా ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ.. ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుందని తెలుస్తుంది. రంగబలి తర్వాత మూడు సినిమాలతో బిజీగా ఉన్న నాగశౌర్య నటిస్తున్న ఓ మూవీ వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు మిగిలిన సినిమాలపై ఆ ప్రభావం కనబడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరీ ఇది ఎంత వరకు నిజమో.. చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet