iDreamPost
android-app
ios-app

బన్నీ – త్రివిక్రమ్ లతో.. ఆ హీరోయిన్ హ్యాట్రిక్ కి రెడీ?

  • Author ajaykrishna Updated - 06:06 PM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 06:06 PM, Mon - 25 September 23
బన్నీ – త్రివిక్రమ్ లతో.. ఆ హీరోయిన్ హ్యాట్రిక్ కి రెడీ?

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ తో అవకాశాలు ఆటాడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా అవకాశాలు వచ్చి వాలుతుంటాయి.. ఇంకొన్నిసార్లు చేయిదాకా వచ్చి.. చివర్లో చేజారిపోతుంటాయి. మూడేళ్ల క్రితం వరుస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిన బ్యూటీని కూడా అవకాశాలు ఆట పట్టిస్తున్నాయి. టాలీవుడ్ లో దర్శకుడు త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కి తిరుగులేదు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఒకదాన్ని మించి మరోటి బ్లాక్ బస్టర్స్ అవుతూ వచ్చాయి. అయితే.. ఈ ఇద్దరు స్టార్స్ తో.. విడివిడిగా ఒక్కోటి, కలిసి మరోటి సినిమాలు చేసిన భామ పూజా హెగ్డే.

త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి.. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే.. బన్నీ పూజాల కాంబినేషన్ లో మొదట ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి.. అల వైకుంఠ పురంలో చేశారు. ఆ సినిమా వీరిద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా.. అదే త్రివిక్రమ్ తో బన్నీ కంటే ముందే.. అరవింద సమేత సినిమా చేసింది పూజా. అంటే.. అటు త్రివిక్రమ్ తో రెండు.. బన్నీతో రెండు సినిమాలు చేసింది అమ్మడు. ఇప్పుడు వారిద్దరితో ముచ్చటగా మూడో సినిమా చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ తో ఆల్రెడీ గుంటూరు కారం చేయాల్సింది. మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఆ సినిమాలో మొదట పూజా ఎంపికైంది. కానీ.. తీరా షూటింగ్ సమయంలో ఏమైందో గానీ.. ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ప్రస్తుతం పూజ చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తుంది. సో.. గుంటూరు కారం మిస్ అయ్యింది కాబట్టి.. ఈసారి నెక్స్ట్ చేయబోయే బన్నీ సినిమా కోసం పూజాని ఎంపిక చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ప్రెజెంట్ పూజా వరుస ప్లాప్స్ లో ఉంది. ఖచ్చితంగా ఈసారి చేయబోయే సినిమా ఆమె కెరీర్ ని డిసైడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో.. పూజాకి త్రివిక్రమ్ అవకాశం ఇస్తాడా లేదా? తెలియాల్సి ఉంది. మరి పూజా హెగ్డే గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş