iDreamPost
android-app
ios-app

హిందీ బిగ్ బాస్ విన్నర్ టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ చేసిందని తెలుసా?

  • Published Aug 03, 2024 | 4:43 PM Updated Updated Aug 03, 2024 | 4:43 PM

Sana Makbul: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమైంది. సరికొత్త కాన్సెప్టుతో ముందుకు రాబోతుంది. అలాగే హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి నిన్నటితో తెరపడింది. సనా మక్బుల్ విన్నర్ అయ్యింది. అయితే ఆమె తెలుగులో నటించిందని తెలుసా..?

Sana Makbul: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమైంది. సరికొత్త కాన్సెప్టుతో ముందుకు రాబోతుంది. అలాగే హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి నిన్నటితో తెరపడింది. సనా మక్బుల్ విన్నర్ అయ్యింది. అయితే ఆమె తెలుగులో నటించిందని తెలుసా..?

  • Published Aug 03, 2024 | 4:43 PMUpdated Aug 03, 2024 | 4:43 PM
హిందీ బిగ్ బాస్ విన్నర్ టాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీ చేసిందని తెలుసా?

వినోదం అంటే బుల్లితెర.. స్మాల్ స్క్రీన్ అంటే ఎంటర్ టైన్‌మెంట్ అనేలా మారిపోయింది టెలివిజన్ ఇండస్ట్రీ. సరికొత్త షోలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను టీవీకి మరింత అతుక్కుపోయేలా చేసింది. కామెడీ షోస్, గేమ్ షోస్, డ్యాన్స్ షోస్ మాత్రమే కాకుండా పండుగలకు, పబ్బాలకు ప్రత్యేకమైన షోస్ చేసి ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటికి బాప్‌లా తయారయ్యింది బిగ్ బాస్. విదేశాల నుండి వచ్చిన ఈ రియాలిటీ షో భారతీయులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రసారం అవుతుంది. ఇక తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా, ఎనిమిదో సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది.

కాగా, హిందీలో కూడా ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీ బిగ్ బాస్ షో కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తయ్యాయి. గత రెండు సీజన్లకు కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ ఆకట్టుకోగా, మూడో సీజన్‌కు అనిల్ కపూర్ హోస్టుగా వ్యవహరించారు. మూడో సీజన్ ఆగస్టు 2తో ముగిసింది. ఇందులో విన్నర్ అయ్యింది ప్రముఖ నటి సనా మక్బూల్. ప్రముఖ ర్యాప్ సింగర్ నేజీ రన్నరప్ గా నిలిచాడు. వీరితో పాటు కృతికా మాల్, రణవీర్ షోరే, సాయి కేతన్ రావ్ టాప్ -5లో నిలిచారు. ఇక ఇందులో తన ఆటతీరుతో ఆకట్టుకుంది సనా మక్చూల్. టైటిల్ గెలిచి.. రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకుంది. అయితే సనా మక్బూల్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో రెండు చిత్రాల్లో నటించిందన్న సంగతి తెలుసా..? అందులో ఓ స్టార్ హీరో సరసన యాక్ట్ చేసింది.

హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ విన్నర్ సనా మక్బూల్ మోడల్ నుండి బుల్లితెర యాక్టర్‌గా మారింది. ముంబయికి చెందిన ఈమె బాలీవుడ్ ధారావాహికల్లో నటించింది. 2014లో నాగశౌర్య హీరోగా వచ్చిన దిక్కులు చూడకకు రామయ్యా చిత్రంలో నటించింది. ఇదే ఆమె వెండితెరపై కనిపించిన తొలి సినిమా. ఇందులో నాగశౌర్య తండ్రి అజయ్‌ని ప్రేమిస్తుంది. నాగశౌర్య ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు. తండ్రి గురించి నిజం తెలిసి పక్కకు తప్పుకుంటుంది. ఇదే కాకుండా ఆమె మరో చిత్రంలో కూడా యాక్ట్ చేసింది. 2017లో మామా ఓ చందమామలోనూ కనిపించింది. అయితే ఆ సినిమా వచ్చినట్లు ఎవరికీ తెలియదు. ఇక తమిళంలోనూ రంగూన్ అనే మూవీ చేసింది. మరోటి కంప్లీట్ అయ్యింది కానీ విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ 3 టైటిల్ గెలుచుకుంది. దీంతోనైనా ఆమె ఫేట్ మారి.. లక్ పలకరిస్తుందేమో చూడాలి. మరోసారి వెండితెరపై కనిపిస్తుందేమో వెయిట్ చేద్దాం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet