iDreamPost
android-app
ios-app

మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేదా

  • Published Jun 11, 2020 | 7:06 AM Updated Updated Jun 11, 2020 | 7:06 AM
  • Published Jun 11, 2020 | 7:06 AMUpdated Jun 11, 2020 | 7:06 AM
మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేదా

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న బసవతారకం హాస్పిటల్ లో జరిగిన బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మోక్షుని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.మోక్షజ్ఞకు శరీరం మీద అదుపు లేదని అర్థమైపోయింది. పొట్ట కూడా కనిపిస్తోంది. హైట్ కు తగ్గ బరువు లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలి ఇంటర్వ్యూలలో త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనేలా సంకేతాలు ఇచ్చిన బాలయ్య ఈ విషయంలో సరైన ప్లానింగ్ తో లేరేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పాతికేళ్ల వయసులో ఎంతో చురుకుగా చలాకీగా ఉండాల్సిన అబ్బాయిలా కనిపించడం లేదని కొందరు అభిమానులే అంటున్నారు. మరి హీరో డెబ్యూకు తగ్గట్టు తనను తాను మలుచుకోవడానికి ఎంతలేదన్నా రెండు మూడేళ్లు ఖచ్చితంగా పడుతుంది. అది కొంత ఆలస్యమనే చెప్పాలి. అసలు ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే సందేహం రావడం సహజం. ఆ మధ్య అసలు మోక్షజ్ఞకు యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తి లేదనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే చిరంజీవి వారసుడు రామ్ చరణ్ దూసుకుపోతూ డిజాస్టర్లతోనూ యాభై కోట్లు రాబట్టే రేంజ్ కు చేరుకున్నాడు. నాగార్జున పిల్లలు చైతు, అఖిల్ ఇంకా ఆ స్థాయికి చేరుకోకపోయినా మంచి పొజిషన్ లో ఉన్నారు.

వెంకటేష్ అబ్బాయికి టైం ఉంది. కానీ మోక్షజ్ఞ రావాల్సిన టైం మాత్రం ఇదే. ఎన్టీఆర్ మూడో తరంలో ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నాడు. మిగిలిన స్టార్ ఫ్యామిలీస్ లాగా తమకూ ముగ్గురు నలుగురు హీరోలు ఉండాలని ఫ్యాన్స్ కోరిక. మరి మోక్షజ్ఞను తక్కువ టైంలో రెడీ చేస్తారేమో చూడాలి. ఇప్పటికే పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి అని ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ అదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఇంకా ఎవరిని అనుకోలేదని సన్నిహితుల మాట. శిక్షణ కోసం మోక్షజ్ఞను రెడీ చేస్తున్నారని ఇప్పటికిప్పుడు కాకపోయినా 2022లో లో గ్రాండ్ గా ప్రవేశపెడతారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఏది ఏమైనా అభిమానుల అంచనాలు ప్రేక్షకుల ఆకాంక్షలు అందుకోవాలంటే మోక్షజ్ఞ ఇలా ఉంటే మాత్రం సరిపోదు. చాలా కష్టపడాలి. 14 ఏళ్ళ వయసులోనే నాన్న నటనలోకి వచ్చేశారు కానీ పాతికేళ్ళకైనా అబ్బాయి సీరియస్ గా తీసుకోకపోతే ఎలా. ఇదే అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet