కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది.. ఇప్పటికే 473 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. వీరిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కర్నూలు గుంటూరు జిల్లాల్లో ప్రమాదకరంగా విస్తరిస్తుండడంతో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు.
తాజాగా అనంతపురం మడకశిర నియోజకవర్గంలో ఒక తహసీల్దార్ కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్ కేంద్రంలో ఉన్నట్లు సమాచారం. కాగా తహసీల్దార్ కు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులకు కూడా కరోనా భయం కమ్ముకుంది. ఆ తహశీల్దార్ మడకశిర ఎమ్మెల్యేతో పాటు పలువురితో సమావేశం అయినట్లు తెలుస్తుంది. దాంతో తహశీల్దార్ ఎవరెవరిని కలిసారన్న దానిపై లోతుగా విచారణ జరుగుతుంది. కాగా మడకశిర ఎమ్మెల్యే మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. తహశీల్దార్ ను కలిసిన వారిని గుర్తించి వారిని క్వారెంటయిన్ సెంటర్లకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సన్నహకాలు చేస్తున్నారు.