iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య విడుదల విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ధైర్యంగా ఒక డేట్ కానీ ఒక అప్ డేట్ కానీ వదలకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో నెలల క్రితం లాహే లాహే లిరికల్ వీడియో తర్వాత ఆచార్య టీమ్ పూర్తి సైలెంట్ అయ్యింది. అడపాదడపా బాలన్స్ ఉన్న షూటింగ్ చేసేస్తున్నారు కానీ అంతకు మించి ఎలాంటి సమాచారం బయటికి చెప్పడం లేదు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన పాన్ ఇండియా సినిమాలే రిలీజ్ పట్ల క్లారిటీతో ఉంటే ఆచార్య పరిస్థితి మాత్రం ఇలా ఉంది.
ఇంత పెద్ద మెగా మూవీకి ఇలాంటి సంకటం రావడం ఆశ్చర్యం కలిగించేదే. ఇప్పుడు దీని చేతిలో ఉన్న ఆప్షన్ డిసెంబర్ నెల మాత్రమే. అది కూడా క్రిస్మస్ సీజన్ అయితేనే మంచి వసూళ్లు ఆశించవచ్చు. అయితే 17వ తేదీని పుష్ప తీసేసుకున్నాడు. దానితో నేరుగా పోటీ పడటం కరెక్ట్ కాదు. ఇది కాకుండా 83 లాంటి భారీ బాలీవుడ్ మూవీ కూడా రాబోతున్న తరుణంలో తొందరపడటం సేఫ్ అనిపించుకోదు. పోనీ మొదటివారం వద్దామా అంటే కలెక్షన్ల గురించి టెన్షన్. నవంబర్ నెలను ఆచార్య పరిగణిస్తున్నట్టు కనిపించడం లేదు. దీపావళికి బాలకృష్ణ అఖండ, రజనీకాంత్ అన్నాతే, అక్షయ్ కుమార్ సూర్యవంశీ ఆల్రెడీ కన్నేశాయి.
ఆచార్య వీటికి తీసిపోయేదేమీ కాదు కానీ ముందే చెప్పకపోవడం వల్ల ఆ టైంకంతా ఇబ్బందులు వచ్చి పడే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 24 ఒకటే మెగా మూవీకి ఉన్న డేట్ గా కనిపిస్తోంది. ముందు పుష్ప ఆ తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ వీటిని ఫేస్ చేయడం అంత సులభంగా ఉండదు. ఈ కారణంగానే చిరంజీవి ఎక్కువ ఆలోచించకుండా గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీ అయిపోయినట్టు ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఇదేదీ కుదరకపోతే 2022 జనవరి చివరి వారంలో లేదా మార్చిలో భీమ్లా నాయక్ కంటే ముందుగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే బాగా లేట్ అయినా ఆచార్య ఏదో ఒకటి తేల్చి పారేయడం బెటర్
Also Read : సుప్రీమ్ హీరో సినిమా సేఫ్ అవుతుందా