సుప్రీమ్ హీరో సినిమా సేఫ్ అవుతుందా

By iDream Post Oct. 04, 2021, 04:30 pm IST
సుప్రీమ్ హీరో సినిమా సేఫ్ అవుతుందా

ఆశించినంత బజ్ లేకుండా విడుదలైన సాయి తేజ్ రిపబ్లిక్ కు డివైడ్ టాక్ నడుస్తోంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దాన్ని దర్శకుడు దేవ కట్టా ప్రెజెంట్ చేసిన తీరు పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. రిస్కీ క్లైమాక్స్ ఉండటంతో అనవసర హంగామా చేసి ప్రచారం చేయడం వల్ల లేనిపోని హైప్ పెరుగుతుందేమోనని భావించిన నిర్మాతలు ప్రీ రిలీజ్ తప్ప పబ్లిసిటీ మీద అంతగా ఫోకస్ చేయకపోవడం మైనస్ గా మారింది. మొదటి రోజు వీక్ గానే స్టార్ట్ చేసినా శని ఆదివారాలు కొంచెం బెటర్ గానే పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా లవ్ స్టోరీ తర్వాత ఒకే ఆప్షన్ కావడం ప్లస్ అవుతోంది.

ఇక ట్రేడ్ నుంచి అందిన అనధికార సమాచారం మేరకు రిపబ్లిక్ వీకెండ్ పర్వాలేదనిపించేలా మొదలుపెట్టింది. గత వారం రిలీజైన లవ్ స్టోరీతో పోల్చుకుంటే ఇది డల్ పెర్ఫార్మన్స్. ఏపిలో యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసినా ఒక రోజంతా దీనికి కలెక్షన్లు భారీగా వచ్చేవి. కానీ అలా జరగలేదు. యాక్సిడెంట్ వల్ల ఆసుపత్రిలోనే ఉన్న సాయి తేజ్ మీద సానుభూతి ఉన్నప్పటికీ ఆ అంశం రిపబ్లిక్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఎలా చూసుకున్నా ఇప్పుడు వచ్చిన వసూళ్లు సుప్రీమ్ హీరో స్థాయి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునేలా లేవు

నైజామ్ - 1 కోటి 38 లక్షలు
సీడెడ్ - 86 లక్షలు
ఉత్తరాంధ్ర - 60 లక్షలు
ఈస్ట్ గోదావరి - 33 లక్షలు
వెస్ట్ గోదావరి - 32 లక్షలు
గుంటూరు - 37 లక్షలు
కృష్ణా - 32 లక్షలు
నెల్లూరు - 24 లక్షలు

ఏపి/తెలంగాణ 3 రోజుల షేర్ - 4 కోట్ల 42 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా - 24 లక్షలు
ఓవర్ సీస్ - 38 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ - 5 కోట్ల 4 లక్షలు

రిపబ్లిక్ సుమారుగా 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బిజినెస్ జరుపుకుంది. నిజానికిది పెద్ద మొత్తం కాదు. లవ్ స్టోరీ దీనికి 20 కోట్లు అదనంగా పెట్టుకుని వచ్చినా రెండు వారాలు దాటగానే దాదాపు మొత్తాన్ని రికవరీ చేసింది. అలాంటప్పుడు 13 అనేది పెద్ద భయపెట్టే నెంబర్ కాదు. కానీ రిపబ్లిక్ కి వచ్చిన టాక్, రెస్పాన్స్ చూస్తుంటే అదే పెద్ద కొండగా కనిపిస్తోంది. ఇంకా ఏడున్నర కోట్లకు పైగా రాబట్టుకోవాల్సి ఉంది. వచ్చే వారం వైష్ణవ్ తేజ్ కొండపొలం, గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ రాబోతున్నాయి. సో సాయి తేజ్ సేఫ్ గా గట్టెక్కడం అంత ఈజీగా కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ కు చాలా కష్టపడాల్సి ఉంటుంది

Also Read : ప్రభాస్ 25 ఎవరితో.. మొత్తం ముగ్గురు లైన్ లో?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp