iDreamPost
iDreamPost
2020ని గ్రాండ్ గా ఆరంభించిన సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్లను, ప్రేక్షకులకు వినోదాన్ని పుష్కలంగా అందించాయి. రేస్ లో రెండే నెగ్గినప్పటికీ మిగిలినవి సైతం వాటి స్థాయి కన్నా ఎక్కువే రాబట్టుకున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇక అందరి చూపు డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వైపు వెళ్తోంది. చిన్ని తెరకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. విశ్వసనీయ సమాచారం మేరకు వీటి డేట్లు వచ్చేశాయి. కాకపోతే అధికారిక సమాచారం లేదు.
దీని ప్రకారం దర్బార్ ఫిబ్రవరి 27న ఆన్ లైన్ లోకి రాబోతోంది. ప్రైమ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ గా తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన ఈ చిత్రం ఇక్కడ మాత్రం ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఇక ఫామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఎంత మంచివాడవురా రెండు రోజుల గ్యాప్ తో ఫిబ్రవరి 29 న టెలికాస్ట్ కాబోతున్నట్టు తెలిసింది ఇక విజేతలుగా నిలిచిన రెండు సినిమాలు మాత్రం ఆలస్యంగా రాబోతున్నాయి. సరిలేరు నీకెవ్వరు మార్చ్ 11న వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. బహుశా దీన్ని ప్రైమ్ చేజిక్కించుకుని ఉండొచ్చు.
ఇక అందరిని హోల్ సేల్ గా మెప్పించిన అల వైకుంఠపురములో చాలా లేట్ గా ఏప్రిల్ 8న స్టీమింగ్ కాబోతోందట. ఇప్పటికే దీని వీడియో సాంగ్స్ జెమినీలో వస్తున్నాయి కనక ఈ సినిమా సన్ నెక్స్ట్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈసారి డిజిటల్ వీక్షణకు ప్రేక్షకులు కాస్త ఎక్కువ సమయమే ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత తక్కువ గ్యాప్ తో వీటి శాటిలైట్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. ఒకవైపు జనం థియేటర్లు రాకపోవడానికి కారణం డిజిటల్ సంస్థలే అని ఎగ్జిబిటర్లు ఘోషిస్తున్న సమయంలో ఈసారి ఎక్కువ గ్యాప్ ఇవ్వడం మేలు చేసేలాగే ఉంది.