iDreamPost
android-app
ios-app

బన్నీ అట్లీ మూవీలో అదిరిన దీపికా ఎంట్రీ

  • Published Jun 07, 2025 | 1:24 PM Updated Updated Jun 07, 2025 | 1:24 PM

అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో రానున్న మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాలోని హీరోయిన్ ను అనౌన్స్ చేస్తూ. ఆమెకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు

అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో రానున్న మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాలోని హీరోయిన్ ను అనౌన్స్ చేస్తూ. ఆమెకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు

  • Published Jun 07, 2025 | 1:24 PMUpdated Jun 07, 2025 | 1:24 PM
బన్నీ అట్లీ  మూవీలో అదిరిన దీపికా ఎంట్రీ

అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో రానున్న మూవీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాలోని హీరోయిన్ ను అనౌన్స్ చేస్తూ. ఆమెకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ అందరికి సినిమా మీద ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసింది. ఆ విజువల్స్ టేకింగ్ అన్నీ కూడా అట్లీ మూవీలో కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కి వండర్ ఫుల్ ఛాన్స్ దక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఇంకాస్త పెరిగిపోతుంది.

పైగా ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషయన్స్ కూడా వర్క్ చేయబోతున్నారట. హీరోయిన్ ఎంట్రీనే ఇంత గ్రాండియర్ గా ప్లాన్ చేసాడంటే ఇక హీరో ఎలివేషన్స్ కు గూస్బంప్స్ గ్యారెంటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అడపా దడపా ఈ సినిమాకు సంబందించిన గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. బన్నీ ట్రిపుల్ రోల్ అని , హీరోయిన్ మృణాల్ లేదా దీపికా అని యల్ చాలా వచ్చాయి. ఫైనల్ గా దీపికానైతే ఫిక్స్ చేశారు. ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని బడ్జెట్ ను ఈ సినిమాకు పెడుతుంది సన్ నెక్స్ట్ పిక్చర్స్.

మొత్తానికి ఈసారి హాలీవుడ్ అడ్డా ను కుదిపేసేలా ఉన్నారు మేకర్స్. ప్రస్తుతానికి బన్నీ , దీపికా అయితే కన్ఫర్మ్ అయిపోయారు, త్వరలోనే మిగిలిన నటి నటుల గురించి కూడా అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. సో ఈ సూపర్ హీరో మూవీ నుంచి ముందు ముందు ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. అవి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటాయో చూడాలి. మరి ఏ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.