Tirupathi Rao
Kona Venkat Serious: టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ, ఇలా అవమానించొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే..
Kona Venkat Serious: టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ, ఇలా అవమానించొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే..
Tirupathi Rao
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి కొన్ని వీడియో ఇట్టే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. వాటిలో కొన్ని వీడియో నెటిజన్స్ నుంచి మన్ననలు పొందితే.. కొన్నిమాత్రం వారి ఆగ్రహావేశాలను చవిచూస్తాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోపై కేవలం నెటిజన్స్ మాత్రమే కాకుండా కోన వెంకట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఒక పురోహితుడిని కించ పరచడం, హేళన చేయడాన్ని చూసి కోన వెంకట్ సీరియస్ అయ్యారు. అలాంటి పనులు తప్పని వాదించారు. అవమానించొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు
సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఏది నిజం? ఏది అబద్ధం అని చెప్పే పరిస్థితి కూడా లేదు. కొన్నింటిని సోషల్ ఎక్స్ పెరిమెంట్ లాగా చేస్తుంటే.. కొందరు మాత్రం వైరల్ చేయడానికి కొన్ని చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎలాంటిదో చెప్పలేం. కానీ, నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఓ పురోహితుడు పెళ్లి చేస్తున్నాడు. ఆయనను అక్కడున్న కొందరు ఆకతాయిలు ఆటపట్టించారు. ఆయనపై ఖాళీ సంచి వేయడం, కండువాలు విసరడం, తలపై కుంకం వేయడం ఇలా హద్దు మీరి ప్రవర్తించారు. ఆ పెళ్లి నుంచి పంతులు లేచి వెళ్లిపోయాడు. ఆ పెళ్లి చేయించడం తన వల్ల కాదు అంటూ తెగేసి చెప్పి మండపం దిగి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ కావడంతో ఓ వర్గం సీరియస్ కూడా అయ్యింది. అలాగే నెటిజన్స్ కూడా సదరు వీడియోపై స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Delibarate insult to a priest is seriously condemnable. Whatever the situation may be, this is very incorrect. Every person in the society should seriously condemn this. పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం దారుణం..కేవలం బ్రాహ్మణులే కాదు సమాజంలోని ప్రతీ హిందువూ దీన్ని తీవ్రంగా… pic.twitter.com/jb2TNxc8LC
— Yamini Sharma Sadineni (Modi Ka Parivar) (@YaminiSharma_AP) April 19, 2024
ఈ వీడియోపై కోన వెంకట్ కూడా స్పందించారు. ఆయన ఈ వీడియో రీ ట్వీట్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఈ అమానవీయ ఘటన, అలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. నేను ఈ ఘటనను ఖండిస్తున్నాను. ఇది అత్యంత హేయం..ఖండనీయం.. అన్ని కులాలను, మతాలను సమాన దృష్టితో చూడటంలో బ్రాహ్మణులు ముందుంటారు. వారిని గౌరవించకపోయినా పర్వాలేదు.. అవమానించకండి” అంటూ కోన వెంకట్ ఆ వైరల్ వీడియోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వీడియో చూసిన చాలామంది ఖండిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక పురోహితుడిని అలా చేయడం సబబు కాదంటూ వారిస్తున్నారు. అలాంటి ప్రవర్తనను కచ్చితంగా అందరూ ఖండించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పని చేసిన ఆకతాయిలను కచ్చితంగా గుర్తించి తగిన శిక్ష వేయాలంటూ వాపోతున్నారు. ఆ వీడియో నిజమైనా.. ఫేక్ అయినా అది మాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I strongly condemn this Inhuman behaviour…
ఇది అత్యంత హేయనీయం .. ఖండనీయం .. అన్ని కులాలను , మతాలను సమాన దృష్టితో చూడడంలో బ్రాహ్మణులు ముందుంటారు .. వారిని గౌరవించక పోయిన పర్వాలేదు .. అవమానించకండి 🙏 https://t.co/Z0NBqJFmNb— KONA VENKAT (@konavenkat99) April 20, 2024