Somesekhar
అడవి శేష్ నటించిన 'గూఢచారి' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతోంది. జీ2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ వదిలారు.
అడవి శేష్ నటించిన 'గూఢచారి' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతోంది. జీ2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ వదిలారు.
Somesekhar
 
        
అడవి శేష్.. టాలీవుడ్ లో ఉన్న మల్టీపుల్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. హీరోగా, రైటర్ గా ఇండస్ట్రీలో తనకో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, ఎవరు, గూఢచారి, హిట్, మేజర్ లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి.. మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రస్తుతం డకాయిట్, గూఢచారి 2 సినిమాలు చేస్తున్నాడు. కాగా.. గూఢచారి సినిమా వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ‘జీ2’ నుంచి 6 బుల్లెట్ల లాంటి స్టిల్స్ ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో మనందరికి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘జీ2’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ కు విజయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘గూఢచారి’ మూవీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఈ స్టిల్స్ ను వదిలారు. దాదాపు ప్రతి స్టిల్ లో గన్ ఉండటం విశేషం. అంటే ఈసారి థియేటర్లలో బుల్లెట్ల సౌండ్ దద్దరిల్లబోతోందని అర్ధమవుతోంది. ఒక్కో స్టిల్ ఒక్కో బుల్లెట్ లా ఉంది.
ఇదిలా ఉండగా.. తొలి భాగం మెుత్తం ఇండియాలో జరగ్గా.. జీ2 ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. పార్ట్ 1లో కనిపించిన పాత్రలతో పాటుగా మరికొన్ని పాత్రలు కనిపించబోతున్నాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక జీ2ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. మరి జీ2 నుంచి రిలీజ్ అయిన ఆరు స్టిల్స్ ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Agent 116 reporting for duty 2025.#MomentsofG2#G2 #Goodachari2#Goodachari turns 6. Signing off #JaiHind 🇮🇳 pic.twitter.com/LWt9pqfV5q
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2024
Lock before you Knock.
3rd of the 6 #MomentsofG2#G2 #Goodachari2 pic.twitter.com/CQValW8iVG
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2024
