iDreamPost
android-app
ios-app

సింహం, పులి, చిరుత.. ఇప్పుడు డైనోసర్ వంతు! సలార్ అప్డేట్ వచ్చేసింది!

  • Author ajaykrishna Updated - 11:25 AM, Fri - 4 August 23
  • Author ajaykrishna Updated - 11:25 AM, Fri - 4 August 23
సింహం, పులి, చిరుత.. ఇప్పుడు డైనోసర్ వంతు! సలార్ అప్డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ మాఫియా యాక్షన్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా.. సలార్ ని మేకర్స్ రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో రిలీజ్ దగ్గర పడుతున్నకొద్దీ.. సలార్ పై రోజురోజుకి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ అయినప్పుడే దాదాపు ఓ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ రానుందని ఎక్స్ పెక్ట్ చేసేశారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు సలార్ ని సాలిడ్ గా సిద్ధం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇటీవల రిలీజ్ చేసిన సలార్ టీజర్ కూడా సినిమాపై అంచనాలను డబుల్ చేసేసింది. దీంతో ఎప్పుడెప్పుడు మూవీ నుండి కొత్తగా అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా సలార్ మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ‘మీరు ఇప్పటిదాకా సింహం, చిరుత, పులిని చూశారు. ఇప్పుడు డైనోసర్ ని చూసే టైమ్ వచ్చేసింది. డైనోసర్ రెడీ అవుతోంది’ అంటూ సలార్ టీమ్ పెట్టిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది పోస్ట్ చేసిన నిమిషాల్లోనే ప్రభాస్ ఫ్యాన్స్.. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ.. తమ ఎక్సయిట్ మెంట్ ని షేర్ చేస్తున్నారు.

ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగిపోయి. డైనోసర్ సాంగ్ తో బాక్సాఫీస్ పూనకాలు ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా.. సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈసారి సలార్ లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్థమైంది. మరోవైపు ఈ సినిమాకు ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కూడా ఓ కారణం. కేజీఎఫ్ సిరీస్ ని తన మ్యూజిక్ తో ఎలా ఎలివేట్ చేసాడో చూశాం. ఇప్పుడు డార్లింగ్ ని సలార్ గా.. డైనోసర్ గా ఎలా ఎలివేట్ చేస్తాడో చూడాలి. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.