RRR : ఆకాశమే హద్దుగా రామ్ భీమ్ రికార్డులు

ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా రాజమౌళి విజువల్ గ్రాండియర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. వీక్ డేస్ లో సహజంగా ఉండే డ్రాప్ పర్సెంటేజ్ కు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక్కడే కాదు అటు నార్త్ తో మొదలుపెడితే పక్కన తమిళనాడు దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా రివ్యూలు చాలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ స్టార్ల ప్రాధాన్యత గురించి ఆన్ లైన్ లో గొడవలు పడుతున్నా ఆ ప్రభావం కొంచెం కూడా పడటం లేదు. నిన్న ఈవెనింగ్, సెకండ్ షోలు సైతం టికెట్లు దొరకనంత రష్ తో హంగామా చేశాయి.

ఇప్పటిదాకా వచ్చిన లెక్క చూస్తే ట్రిపులార్ అయిదు రోజులకుగాను వసూలు చేసిన షేర్ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 170 కోట్లు దాటేసింది. ఇది బాహుబలిని దాటేసిన రికార్డు. ఇంకా మొదటి వారమే పూర్తి కాలేదు. టికెట్ ధరలు తగ్గాక చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల శాతం చాలా ఎక్కువగా ఉంది. పైగా ఈ వారంలో ఉగాది పండగతో పాటు వీకెండ్ రాబోతోంది. సో ఇప్పట్లో దీనికి పగ్గాలు వేయడం కష్టమే. ఏప్రిల్ 1న మిషన్ ఇంపాజిబుల్, హిందీ సినిమా అటాక్, హాలీవుడ్ మూవీ మార్బియస్ వస్తున్నప్పటికీ వాటి ప్రభావం దీని మీద పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బిసి సెంటర్స్ లో ఇప్పటికిప్పుడు నెమ్మదించడానికి ఆర్ఆర్ఆర్ సిద్ధంగా లేదు.

నైజామ్ – 68 కోట్ల 30 లక్షలు
సీడెడ్ – 34 కోట్ల 18 లక్షలు
ఉత్తరాంధ్ర – 19 కోట్ల 32 లక్షలు
ఈస్ట్ గోదావరి – 10 కోట్ల 41 లక్షలు
వెస్ట్ గోదావరి – 9 కోట్ల 17 లక్షలు
గుంటూరు – 13 కోట్ల 32 లక్షలు
కృష్ణ – 10 కోట్లు
నెల్లూరు – 5 కోట్ల 85 లక్షలు

ఏపి / తెలంగాణ 5 రోజుల టోటల్ షేర్ – 170 కోట్ల 55 లక్షలు

కర్ణాటక – 24 కోట్ల 83 లక్షలు
తమిళనాడు – 21 కోట్ల 80 లక్షలు
కేరళ – 5 కోట్ల 35 లక్షలు
హిందీ – 53 కోట్ల 30 లక్షలు
ఇతర రాష్ట్రాలు – 4 కోట్ల 65 లక్షలు
ఓవర్సీస్ – 67 కోట్ల 60 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల షేర్ – 348 కోట్ల 8 లక్షలు

గ్రాస్ (సుమారుగా) – 612 కోట్లు

ఓవర్సీస్ లో 10 మిలియన్ మార్క్ ని కేవలం అయిదు రోజుల్లోనే సాధించడం అక్కడి ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇంకో రెండు మిలియన్లు వస్తే బ్రేక్ ఈవెన్ తో పాటు కొత్త రికార్డులు తోడవుతాయి. బాహుబలి రేంజ్ లో కంటెంట్ లేదనే కామెంట్స్ ఉన్నప్పటికీ దాన్ని మించిన స్థాయిలో ఆర్ఆర్ఆర్ పెర్ఫార్మ్ చేయడం శుభపరిణామం. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ల పెర్ఫార్మన్స్ ఇద్దరినీ ప్యాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన మాట వాస్తవం. ఇక రాజమౌళి సంగతి సరేసరి. తన రికార్డులు తాను మాత్రమే బ్రేక్ చేయాలి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదనే రీతిలో దూసుకుపోతున్న జక్కన్న తన 13న సినిమా మీద అప్పుడే అంచనాలు మొదలుపెట్టించారు

Also Read : Ram Charan : నార్త్ మార్కెట్ మీద చరణ్ కన్ను

Show comments