iDreamPost
android-app
ios-app

RRR Events : రాజమౌళిని మించిన మార్కెటింగ్ గురు ఉంటారా

  • Published Mar 18, 2022 | 12:30 PM Updated Updated Mar 18, 2022 | 12:30 PM
RRR Events : రాజమౌళిని మించిన మార్కెటింగ్ గురు ఉంటారా

సినిమాను మార్కెటింగ్ చేయడంలో, హీరోలను పబ్లిసిటీకి వాడుకోవడంలో రాజమౌళి తరువాత ఇంకెవరు లేరనిపిస్తుంది ఆర్ఆర్ఆర్ కు జరుగుతున్న హంగామా చూస్తుంటే. నిజానికి ఈ కాంబినేషన్ కి ప్రత్యేకంగా హైప్ తేవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బోలెడంత ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఎవరికి వారు తమ హీరోలకు ఓ రేంజ్ లో స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నార్త్ లోనూ దీని మీద బజ్ తక్కువేమీ లేదు. బాహుబలి దర్శకుడిగా జక్కన్న ఇమేజ్ తో పాటు ఇద్దరు హీరోల మార్కెట్ అక్కడి బిజినెస్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతోంది. తమిళనాడులో బుకింగ్స్ అప్పుడే హాట్ కేక్స్ గా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో రాజమౌళి ఇక్కడితో ఆగడం లేదు. 24వ తేదీ రాత్రి తొలి ప్రీమియర్ పడేలోపు ఒకటి రెండు కాదు ఏకంగా పది ఈవెంట్లను ప్లాన్ చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ రోజుతో మొదలుపెట్టి 18న హైదరాబాద్ లో చిన్న వేడుక చేసి సాయంత్రానికి దుబాయ్ చేరుకొని అక్కడ సందడి చేస్తారు. 19న బెంగుళూరు దగ్గర్లో చిక్ బళ్లాపూర్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పుకునే రీతిలో ఈవెంట్ ఉండబోతోంది. 20న బరోడా వెళ్ళిపోతారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీలో మరో హల్చల్ జరుగుతుంది. 21న అమ్రిత్సర్ – జైపూర్, 22న కోల్కతా – వారణాసిలు పూర్తి చేసుకుని 23న ఫైనల్ టచ్ ని హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కోసం ఇస్తారు.

దీని కోసం చరణ్ తారక్ లతో పాటు యూనిట్ మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తనుంది. ఫ్లైట్లు, ఈవెంట్లు తప్ప మరోచోట వీళ్ళు కనిపిస్తే ఒట్టు అనేలా సాగుతోంది. ఇక్కడితో జక్కన్న రిలాక్స్ కావడం లేదు. గ్యాప్ దొరికితే చాలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు వరసపెట్టి ఇప్పించేస్తున్నారు. మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ల కెరీర్ లో ఇంత భారీ స్థాయిలో వాళ్ళు ఎప్పుడూ ప్రమోట్ చేయలేదన్నది వాస్తవం. రెస్ట్ లేకుండా అలిసిపోతున్నా సరే లెక్క చేయడం లేదు. బెనిఫిట్ షోకు ఇద్దరు హీరోలతో కలిసి రాజమౌళి ఓ థియేటర్లో లైవ్ చూస్తారనే టాక్ ఉంది కానీ అభిమానుల తాకిడి దృష్ట్యా అది ఎక్కడనేది చెప్పడం లేదు. ఒకవేళ లీకైతే మాత్రం రాలేరు కూడా.

Also Read : Bheemla Nayak OTT : నాయక్ రెండు ఓటిటిల్లో ఎందుకు వస్తున్నట్టు