iDreamPost
android-app
ios-app

RRR : 900 కోట్లతో రామ్ భీమ్ ల సంచలనం

  • Published Apr 04, 2022 | 3:15 PM Updated Updated Apr 04, 2022 | 3:16 PM
RRR : 900 కోట్లతో రామ్ భీమ్ ల సంచలనం

2022 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సంచలనాలు ఆగేలా కనిపించడం లేదు. రికార్డుల సునామికి బ్రేకులు పడటం లేదు. నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. తెలుగు సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటేనే సీన్ ఏ రేంజ్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 900 కోట్ల గ్రాస్ ని సగర్వంగా అందుకున్న ఈ రాజమౌళి మల్టీ స్టారర్ ఇంకొద్ది రోజుల్లోనే కాదు గంటల్లోనే వెయ్యి మార్కు అందుకోవడం లాంఛనమే. బాహుబలి 2 రికార్డులు దాదాపుగా స్మాష్ అయినట్టే. ఫైనల్ రన్ లో దాన్ని అధిగమించగలదా లేదా అనేది తేలాలంటే ఇంకొద్దిరోజులు ఆగాలి.

నిన్న మొన్న ఉగాది సెలవులు ట్రిపులార్ కి బాగా కలిసి వచ్చాయి. కొన్ని ఉత్తరాది సెంటర్స్ ఆదివారం కలెక్షన్ రిలీజైన రెండో రోజు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ స్పందన చూసేందుకే రామ్ చరణ్ స్వయంగా ముంబై వెళ్లి అక్కడి థియేటర్లో జనం రెస్పాన్స్ చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం వీడియో రూపంలో ఆల్రెడీ హల్చల్ చేస్తోంది. బీస్ట్. కెజిఎఫ్ 2 వచ్చేవరకు ఈ స్పీడుకు బ్రేకులు పడటం అసాధ్యం. వరుణ్ తేజ్ గని ప్రభావం అంతగా ఉండదని దాని మీద బజ్ ని చూస్తే అర్థమైపోతోంది. టికెట్ ధరలు మరీ అధికంగా ఉన్నప్పటికీ పబ్లిక్ వాటిని లెక్కచేయకుండా ట్రిపులార్ కు బ్రహ్మరథం పట్టడం విశేషం

నైజామ్ – 97 కోట్ల 5 లక్షలు
సీడెడ్ – 44 కోట్ల 80 లక్షలు
ఉత్తరాంధ్ర – 30 కోట్ల 5 లక్షలు
ఈస్ట్ గోదావరి – 13 కోట్ల 75 లక్షలు
వెస్ట్ గోదావరి – 11 కోట్ల 60 లక్షలు
గుంటూరు – 16 కోట్ల 30 లక్షలు
కృష్ణా – 12 కోట్ల 95 లక్షలు
నెల్లూరు – 7 కోట్ల 95 లక్షలు

ఏపి తెలంగాణ 10 రోజుల షేర్ – 234 కోట్ల 45 లక్షలు

కర్ణాటక – 37 కోట్ల 15 లక్షలు
తమిళనాడు – 33 కోట్ల 70 లక్షలు
కేరళ – 9 కోట్ల 20 లక్షలు
హిందీ – 91 కోట్ల 10 లక్షలు
ఇతర రాష్ట్రాలు- 6 కోట్ల 85 లక్షలు
ఓవర్సీస్ – 84 కోట్ల 20 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 రోజుల షేర్ – 496 కోట్ల 70 లక్షలు

గ్రాస్ లెక్కలో చూసుకుంటే ఇది 900 కోట్లు అవుతుంది. బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఇంకొక్క 45 కోట్ల దాకా వస్తే చాలు. ఫైనల్ రన్ ఇంకా దూరం ఉంది కాబట్టి చేరుకోవడం ఈజీనే. ఇవాళ నుంచి తెలంగాణ ఏపిలో ప్రత్యేక అనుమతుల గడువు ముగుస్తుంది. సో టికెట్ రేట్లలో తగ్గుదల ఉంటుంది. ఇది రెగ్యులర్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది. ఫైనల్ గా బాహుబలి 2 ని వరల్డ్ వైడ్ గా క్రాస్ చేయడం అసాధ్యం అనిపిస్తోంది కానీ చివరిదాకా వేచి చూస్తే కానీ చెప్పలేం. బుకింగ్స్ లో సాధారణంగా కనిపించే వీక్ డేస్ డ్రాప్ అవుట్ ఎంత శాతంలో ఉండబోతోందనేది ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను ప్రభావితం చేయబోతోంది. చూద్దాం

Also Read : Tollywood : హడావిడంతా ఇప్పుడే తర్వాతంతా మామూలే