iDreamPost
android-app
ios-app

వార్-2 : ఇద్దరు సింహాల మధ్య యుద్ధం

  • Published May 20, 2025 | 11:59 AM Updated Updated May 20, 2025 | 12:51 PM

War 2 Telugu Teaser : తారక్ అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు వార్ 2 నుంచి అప్డేట్ వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో తారక్ బర్త్ డే సందర్బంగా వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

War 2 Telugu Teaser : తారక్ అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు వార్ 2 నుంచి అప్డేట్ వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో తారక్ బర్త్ డే సందర్బంగా వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

  • Published May 20, 2025 | 11:59 AMUpdated May 20, 2025 | 12:51 PM
వార్-2 : ఇద్దరు సింహాల మధ్య యుద్ధం

వార్ 2 షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేయలేదు మేకర్స్. దీనితో అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. తారక్ బర్త్ డే సందర్బంగా వార్ 2 సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఈ టీజర్ సోషల్ మీడియాలో గట్టిగా రీసౌండ్ చేస్తుంది. ఈరోజు నుంచే మూవీ ప్రమోషన్స్ కు మూవీ టీం శ్రీకారం చుట్టారనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను ఆగస్టు 14 న రిలీజ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు మూవీ టీం.

ఇక టీజర్ విషయానికొస్తే ఈ టీజర్ మూవీ స్టోరీ ఏంటో పూర్తిగా చెప్పినట్లు లేదు కానీ.. అక్కడక్కడ కొన్ని క్లూస్ మాత్రం ఇచ్చారు. ఇండియాలోనే బెస్ట్ రా ఏజెంట్ గా పేరు పొందిన హృతిక్ ను సవాల్ చేస్తాడు తారక్. ఇకపై హృతిక్ కు ఆ పేరు లేకుండా చేస్తానని అంటాడు. కానీ హృతిక్ అతనిని తక్కువ అంచనా వేస్తాడు. ఆ తరవాత దానిని అర్థంచేసుకుంటాడు. అక్కడినుంచి ఆ ఇద్దరి సింహాల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇంతకీ అది ఆ ఇద్దరి మధ్య యుద్దమా , దేశం కోసం యుద్దమా చివరికి ఏమైంది.. చివరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది తెరపైన చూస్తే కానీ అర్థంకాదు. ఇక కొద్దిరోజుల్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మూవీ ప్లాట్ పై ఇంకాస్త ఐడియా వచ్చే అవకాశం ఉంది.

ఇక విజువల్స్ విషయానికొస్తే ఎప్పటిలానే యష్ రాజ్ తన విజువల్ వండర్ మార్క్ ను చూపించాడు. హాలీవుడ్ రేంజ్ లో ఫైట్ లు , ఛేజ్ లు మాస్ ఆడియన్స్ ను కంప్లీట్ గా శాటిస్ఫై చేస్తాయని చెప్పి తీరాల్సిందే. ఇక తారక్ ఇంట్రో , హృతిక్ తారక్ ఒకరితో ఒకరు తలపడే ఎపిసోడ్స్ అయితే మూవీ మొత్తానికి హైలేట్ గా నిలిచేలా ఉన్నాయి. ప్రస్తుతానికి రిలీజ్ అయింది టీజర్ ఏ కాబట్టి ఇది కథ అనే క్లారిటీకి అప్పుడే రాలేము. కంటెంట్ గురించి ఓ నిర్దారణకు రావాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సినిమాలో అభిమానుల అంచనాలకు మించిన పెద్ద యుద్ధాన్నే చూపించేలా ఉన్నాడు దర్శకుడు. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి వార్ 2 ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.