iDreamPost
android-app
ios-app

‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్​కు అద్భుతమైన రెస్పాన్స్!

  • Published Feb 24, 2024 | 3:21 PM Updated Updated Feb 24, 2024 | 3:21 PM

మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఓటీటీతో పాటు యూట్యూబ్​లో అదరగొడుతోంది. హిందీ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది.

మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఓటీటీతో పాటు యూట్యూబ్​లో అదరగొడుతోంది. హిందీ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది.

  • Published Feb 24, 2024 | 3:21 PMUpdated Feb 24, 2024 | 3:21 PM
‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్​కు అద్భుతమైన రెస్పాన్స్!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా గత అక్టోబర్​లో థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, విజయ్ ‘లియో’తో పాటు రిలీజ్ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది. ఇక హిందీ వెర్షన్ కూడా పెద్దగా ఆడలేదు. అయితే బిగ్ స్క్రీన్స్​లో భారీ కలెక్షన్స్ రాకపోయినా ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి స్పందన రాబడుతోంది. మొదట హిందీ డబ్బింగ్ వెర్షన్​ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. కాగా, ఈ ప్లాట్​ఫామ్​లో ఇది వరకే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఒకేసారి కాకుండా కొన్ని రోజుల తర్వాత విడుదలైన హిందీ వెర్షన్ మంచి వ్యూయర్ షిప్​ను నమోదు చేసింది.

ఇటీవల హిందీ వెర్షన్​ను యూట్యూబ్​లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురాగా.. విడుదలైన రెండు రోజుల్లోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ ఏకంగా 11 మిలియన్ వ్యూస్, 200కే లైక్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ యూట్యూబ్ వెర్షన్ నిడివి కేవలం 144 నిమిషాలు (2 గంటల 24 నిమిషాలు). ఇది సినిమా అసలు టైమ్ కంటే చాలా తక్కువ. థియేట్రికల్ వెర్షన్ దాదాపు 3 గంటలు ఉంటుంది. మొదటి రోజు సినిమా నిడివి మరీ ఎక్కువ అనే నెగటివ్ టాక్ బాగా వచ్చింది. అయితే యూట్యూబ్ రిలీజ్​లో నిడివి తగ్గించడం సినిమాకి కలిసి వచ్చింది. అందుకే రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ పొందటమే కాకుండా టాప్ 10 లిస్ట్​లో ‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్ ట్రెండింగ్​లో ఉంది.

ఎట్టకేలకు ‘టైగర్ నాగేశ్వరరావు’ డిజిటల్ రిలీజ్​లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం రవితేజ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. నలుగురు రాష్ట్ర పోలీసు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ బందిపోటు టైగర్ నాగేశ్వరరావు కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులు థ్రిల్స్​తో కూడిన దొంగతనాలు ఉంటాయి అనుకున్నారు. అయితే సినిమాలో రవితేజ నటన, కొన్ని ఫైట్లు బాగున్నా.. సెంటిమెంట్ మరీ ఎక్కువైందనే టాక్ తెచ్చుకుంది. ఏదైతేనేం కనీసం యూట్యూబ్​లో అయినా సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడం మంచి విషయమే కదా. మరి.. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను మీరు చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జైలర్ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టిన నెల్సన్