iDreamPost
android-app
ios-app

జైలర్ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టిన నెల్సన్

  • Published Feb 24, 2024 | 2:06 PM Updated Updated Feb 24, 2024 | 2:06 PM

నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

  • Published Feb 24, 2024 | 2:06 PMUpdated Feb 24, 2024 | 2:06 PM
జైలర్ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టిన నెల్సన్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస ఫ్లాపుల తరువాత రజినీకి రీఎంట్రీ సినిమాగా నిలిచిందీ జైలర్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ స్టార్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. అనేక కేంద్రాలలో రికార్డ్ కలెక్షన్లను నమోదు చేసిన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా 620 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన జైలర్ తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

2023 సౌత్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాసర్ గా జైలర్ నిలిచింది. లియో, సలార్ వంటి క్రేజీ చిత్రాలు కూడా జైలర్ కలెక్షన్లను దాటడంలో ఫెయిల్ అయ్యాయి. జైలర్ క్లైమాక్స్ లో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పార్ట్ 2 కి హింట్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా జైలర్ 2 కన్ఫర్మ్ అయిందని, నెల్సన్ ఆ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 2025లో లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సీక్వెల్ మొదలవుతుందట. కాగా జైలర్ సీక్వెల్ గురించి ఆ సినిమాకి రజినీకాంత్ కోడలుగా నటించిన నటి మిర్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జైలర్ పార్ట్ -2 గురించి నెల్సన్ సర్ తో మాట్లాడానని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. నెల్సన్ సర్ చెప్పింది విన్నాక తను చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నట్లు మిర్నా తెలిపారు. అయితే జైలర్ సీక్వెల్ లో తన పాత్ర ఉంటుందో లేదో తెలియదని కూడా చెప్పారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమాలో రజినీ మాస్ మ్యానరిజమ్స్ తో పాటు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్స్ రోల్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది. జైలర్ సీక్వెల్ లో మా శివన్న పాత్ర ఖచ్చితంగా ఉండాలి అంటూ అభిమానులు ఇప్పటికే జైలర్ పార్ట్ 2 పై భారీ అంచనాలు పెంచేసుకున్నారు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet