iDreamPost
android-app
ios-app

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ ఇదే? యూనివర్సల్ టచ్ తో!

  • Published Jul 25, 2024 | 1:17 PMUpdated Jul 25, 2024 | 1:17 PM

Mahesh, Rajamouli Movie Title : రాజమౌళి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న టెక్ అప్ చేసిన మరో ప్రాజెక్ట్ మహేష్ తోనే.. ఇప్పుడు ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Mahesh, Rajamouli Movie Title : రాజమౌళి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న టెక్ అప్ చేసిన మరో ప్రాజెక్ట్ మహేష్ తోనే.. ఇప్పుడు ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Jul 25, 2024 | 1:17 PMUpdated Jul 25, 2024 | 1:17 PM
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ ఇదే? యూనివర్సల్ టచ్ తో!

ఆల్రెడీ మహేష్ , రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ కాంబో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ అనౌన్సుమెంట్ అయితే ఇచ్చేసారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ను కూడా రివీల్ చేయలేదు మేకర్స్. ఇక క్యాస్టింగ్ కూడా అంతే మహేష్ తప్ప మిగిలిన నటీ నటులు ఎవరై ఉంటారన్న ఊసే లేదు. పోనీ నటి నటుల సంగతి పక్కన పెట్టేస్తే.. కనీసం మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు. అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే హింట్స్ కూడా ఏమి లేవు. ఈ క్రమంలో మూవీ టైటిల్ పైన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

ఇప్పుడు సాధారణంగా సెలెబ్రిటీల స్పెషల్ అకేషన్స్ రోజున.. వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం.. కొత్తేమి కాదు. ఇప్పటివరకు చాలానే సినిమాల విషయంలో ఇది జరిగింది. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటి నటుల బర్త్ డేస్ వస్తున్నాయంటే.. వారి సినిమాలకు సంబంధించిన ఏమైనా అప్ డేట్స్ వస్తాయేమో అని ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు ఉంది. ఇప్పటివరకు అయితే బర్త్ డే మహేష్ బర్త్ డే సంధర్బంగా.. వచ్చే అప్ డేట్స్ ఏమి కనిపించడం లేదు. కానీ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి “గోల్డ్” అనే టైటిల్ ను పెడుతున్నట్లు సమాచారం. ఇదొక యూనివర్సల్ టైటిల్ అని.. దాదాపు ఈ టైటిల్ ను ఫిక్స్ చేస్తారని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ప్రస్తుతానికి.. మహేష్ బర్త్ డే రోజైన ఈ సినిమాకు సంబంధించిన మూవీ అప్ డేట్ వస్తుందేమో అని.. ఎదురుచూస్తున్నారు అభిమానులు. రాజమౌళి గురించి తెలియనిది కాదు. ఏం చేసిన ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. కాస్త ఆలస్యం అయినా కానీ.. ప్రేక్షకులలో హైప్ పెంచే అప్ డేట్ నే రివీల్ చేస్తారని.. మరి కొంతమంది భావిస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ చేయడానికి ముందే.. ఈ సినిమాలోని క్యాస్టింగ్ , మూవీ స్టోరీ లైన్ లాంటి వివరాలకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని.. ఆ తర్వాత రాజమౌళి ఓ వర్క్ షాప్ నిర్వహిస్తారని.. ఆ తర్వాతే మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తుంది. మరి ఇప్పుడు వినిపిస్తున్న ‘గోల్డ్’ అనే మూవీ టైటిల్ ను మహేష్ బర్త్ డే రోజు ప్రకటిస్తారా ! లేదా దీనిని వర్కింగ్ టైటిల్ గా కన్సిడర్ చేస్తారా ! ఈ విషయాలన్ని తెలియాలంటే.. మేకర్స్ నుంచి ఎదో ఒక అఫీషియల్ అప్ డేట్ రావాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి