iDreamPost
android-app
ios-app

పుష్ప 2 వాయిదా.. ఆ కారణమేనా..?

Pushpa 2 Postpone.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై కనిపించి రెండేళ్లు గడిచిపోయింది. అతడి రాక కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే..

Pushpa 2 Postpone.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెండితెరపై కనిపించి రెండేళ్లు గడిచిపోయింది. అతడి రాక కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే..

పుష్ప 2 వాయిదా.. ఆ కారణమేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న అప్ కమింగ్ చిత్రం పుష్ప 2. 2021లో విడుదలైన పుష్పకు సీక్వెల్. ఈ మూవీ కోసం మూడేళ్ల నుండి కసరత్తులు చేస్తున్నాడు బన్నీ. పుష్ప 2- ద రూల్ పేరుతో తెరకెక్కుతోంది. ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాత. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ అన్న సంగతి విదితమే. జగదీష్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ పుట్టిన రోజున రిలీజ్ చేసిన టీజర్, పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇటీవల సూసేటీ అగ్గిరవ్వ మాదిరి.. ఉంటాడే నా సామి అంటూ సాగిపోయే పాటకు కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇద్దరి మధ్య వచ్చే హుక్ స్టెప్స్..ఫిదా కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాగా, ఇప్పుడు ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. అదే బన్నీ మూవీ పోస్టు పోన్ అని. ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. జూన్ మధ్య నాటికి షూటింగ్ పార్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అల్లు అర్జున్ దర్శకుడితో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడానికి నెల పడుతుందన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ మేరకు కోరినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారని కూడా సమాచారం.

అలాగే ఫహాద్ ఫజిల్ కూడా మొన్నటి వరకు తన ఆవేశం మూవీ బిజీలో ఉండి.. ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయాడు. ఇప్పడు డేట్లు ఇవ్వడంతోనే అతని పోర్షన్ల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. సినిమా ఎండింగ్ దశలో ఉండగా.. సినిమా ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.. నవీన్ నూలి ఒక్కడే ఎడిట్ కట్‌లో బిజీగా ఉన్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో సుకుమార్ కన్విన్స్ కాకపోవడంతో అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం, పుష్ప 2: ది రూల్ షూటింగ్ జూలై చివరి వరకు జరుగుతుందని తెలుస్తుంది. ఇవే.. పుష్ప 2 వాయిదాకు కారణాలవుతున్నాయి.  నిర్మాతలు సైతం సుకుమార్‌పై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. బన్నీ సైతం ఆన్ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయాలని పట్టుబుడుతున్నాడట.  మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి