iDreamPost
అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు
అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు
iDreamPost
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు. ఒకదశలో యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామనుకున్న హిందీ నిర్మాత నిర్ణయం మార్చుకుని థియేటర్ కు రావడం కనక వర్షం కురిపించింది. ఇరవై రోజులకే ప్రైమ్ ఓటిటిలో వచ్చినా కూడా వసూళ్ల ఉధృతి తగ్గకపోవడం గురించి ముంబై మీడియా ప్రధానంగా చెప్పుకుంది. అందుకే అందరి దృష్టి సెకండ్ పార్ట్ వైపు వెళ్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు సుకుమార్ పుష్ప సీక్వెల్ స్క్రిప్ట్ ని లాక్ చేసే పని లో ఉన్నారు. ఇది పూర్తయితే ఆర్టిస్టుల డేట్లను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా క్యాస్టింగ్ మొత్తం మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి. రెండు మూడు పాత్రలు తప్ప అన్ని అవే ఉంటాయి. ముఖ్యంగా ఫాహద్ ఫాసిల్ క్యారెక్టర్ కీలకం కావడంతో ఎక్కువ షెడ్యూల్స్ లో తను పాల్గొనాల్సి ఉంటుంది. డిసెంబర్ కే రిలీజ్ అనుకుంటే మాత్రం సుక్కు మీద ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. పదకొండు నెలల సమయం ఉంది కనక అదేమంత కష్టం కాదు. బన్నీ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవ్వాలి కాబట్టి వేగంగానే పూర్తవ్వాలి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద అంచనాలు పెరిగిపోతాయి. ఊ అంటావా రేంజ్ లో మరో ఐటెం సాంగ్ ని రెడీ చేస్తారట. ఈ సెకండ్ పార్ట్ లో అనసూయ, సునీల్ లకు స్పేస్ ఎక్కువ దొరకనుంది. బాహుబలి, కెజిఎఫ్ తరహాలో అసలు కథంతా దీంట్లోనే ఉందనేలా ప్రమోషన్ ప్లాన్ చేసుకుంటే హైప్ పెరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పటికే సీక్వెల్స్ కి ఉన్న నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది ఒక్క బాహుబలి మాత్రమే. కెజిఎఫ్ ఫలితం వచ్చే నెల తెలుస్తుంది కాబట్టి అప్పుడే ఈ క్యాటగిరీలో వేయలేం. పుష్ప 2ని కూడా వీటి సరసన చేరాలనే ఫ్యాన్స్ కోరిక. అన్నట్టు పుష్ప రాజ్ కు ఎలాంటి ఫినిషింగ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది
Also Read : Radhe Shyam : ఇవి సరిచేసుకుంటే హిట్ టాక్ వచ్చేదేమో