iDreamPost
android-app
ios-app

అమీర్ ప్లానింగ్ అదుర్స్.. మహాభారతంలో అర్జునుడిగా బన్నీ.. ?

  • Published May 12, 2025 | 12:32 PM Updated Updated May 12, 2025 | 12:32 PM

సినిమాలలో ఇతిహాస కథలకు ఎప్పుడు భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఆల్రెడీ ఓ వైపు రామాయణం మూవీ షూటింగ్ దశలు ఉంది . ఇక మరోవైపు ఎప్పుడెప్పుడు మహాభారతంను తెరకెక్కిద్దామా అని ఎదురుచూస్తున్నాడు అమీర్ ఖాన్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వినిపిస్తుంది అదేంటో చూసేద్దాం.

సినిమాలలో ఇతిహాస కథలకు ఎప్పుడు భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఆల్రెడీ ఓ వైపు రామాయణం మూవీ షూటింగ్ దశలు ఉంది . ఇక మరోవైపు ఎప్పుడెప్పుడు మహాభారతంను తెరకెక్కిద్దామా అని ఎదురుచూస్తున్నాడు అమీర్ ఖాన్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వినిపిస్తుంది అదేంటో చూసేద్దాం.

  • Published May 12, 2025 | 12:32 PMUpdated May 12, 2025 | 12:32 PM
అమీర్ ప్లానింగ్ అదుర్స్..   మహాభారతంలో అర్జునుడిగా బన్నీ.. ?

మహాభారతం కథ మొత్తాన్ని ఐదు భాగాలుగా తీయాలి అనేది.. ఎప్పటినుంచో అమీర్ ఖాన్ కు ఉన్న డ్రీం. అమీర్ ఖాన్ ఎప్పుడు భారీ ప్రాజెక్ట్స్ నే మోస్తూ ఉంటాడు. వాటిలో ఇది కూడా ఒకటి. అయితే ఈ సినిమా మొదటి భాగానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా భారీగానే ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద నటులను ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయడానికి అమీర్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నారట. దీనిలో భాగంగా ఇప్పుడు వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

రీసెంట్ గా అట్లీ సినిమాకు ముంబై వెళ్ళాడు బన్నీ. అదే సమయంలో అక్కడ అమీర్ ఖాన్ ను కూడా కలిసాడు. బన్నీ అమీర్ ను కలవడానికి సరైన రీజన్ ఏంటో తెలియదు కానీ.. కచ్చితంగా మహాభారతం ప్రాజెక్ట్ గురించే కలిసి ఉంటాడని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. మరోవైపు డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ కూడా బన్నీతో కలిసి వర్క్ చేయాలనీ అనుకుంటున్నారట . ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ డైరెక్టర్ బన్నీని కలిసినట్టు సమాచారం. సో దాదాపు మహాభారతం ప్రాజెక్ట్ లో వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయినట్లే అనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ ఆలోచన ప్రకారం ఈ ఐదు భాగాలను ఐదుగురు దర్శకులకు అప్పగించి.. వీలైనంత త్వరగా ఫినిష్ చేసి.. ఆరు నెలల గ్యాప్ తో ఒక్కో పార్ట్ ను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాడట. మరి ఇది ఎంత వరకు సాధ్యమో తెలియదు కానీ… ప్రస్తుతానికైతే క్యాస్టింగ్ కోసం గట్టిగ జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.