iDreamPost
android-app
ios-app

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి పవన్‌ సాయం! ట్విస్ట్‌ ఏంటంటే?

నందమూరి బాలక్రిష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు సినిమాల్లోకి వస్తారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

నందమూరి బాలక్రిష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు సినిమాల్లోకి వస్తారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి పవన్‌ సాయం! ట్విస్ట్‌ ఏంటంటే?

నందమూరి నట సింహం బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న సంగతి తెలిసిందే. కుమారుడి ఎంట్రీ గురించి గతంలోనే బాలక్రిష్ణ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ఆదిత్య 369కు సీక్వెల్‌ తీయబోతున్నట్లు.. అందులో మోక్షజ్ఞను హీరోగా నటించబోతున్నట్లు ప్రకటించారు.  ఆ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తానని కూడా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఈ మూవీపై బాలయ్యనుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా సందిగ్ధత నెలకొంది. వచ్చే ఏడాది అతడి సినిమా ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా కోసం మొదట శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌గా అనిల్‌ రావిపూడి గానీ, బోయపాటి శ్రీనును గానీ తీసుకోవాలని బాలక్రిష్ణ చూస్తున్నారన్న టాక్‌ కూడా నడిచింది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వకీల్‌ సాబ్‌ దర్శకుడు వేణు శ్రీరామ్‌ పేరు తెరపైకి వచ్చింది. మోక్షజ్ఞ సినిమా కోసం వేణు శ్రీరామ్‌.. బాలక్రిష్ణకు కథ వినిపించారట.

pawan kalyan help to mokshagna

బాలయ్యకు కథ నచ్చడంతో ఓకే కూడా చెప్పారట. ఈ మొత్తం కథలో పవన్‌ కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించారని టాక్‌. బాలయ్యకు వేణు శ్రీరామ్‌ పేరును పవన్‌ కల్యాణ్‌ చెప్పారట. అతడిలో చాలా టాలెంట్‌ ఉందని, చాలా కంఫర్ట్‌గా పని చేసుకోవచ్చని చెప్పారట. బాలయ్య కూడా తాను తన కుమారుడి కోసం ఇలాంటి దర్శకుడ్నే చూస్తున్నానని అన్నాడట. మూవీ సబ్జెక్ట్‌ను కూడా లాక్‌ చేసినట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే.. నందమూరి ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు ఉండవు.

కాగా, వేణు శ్రీరామ్‌ 2011లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్‌’ సినిమాతో దర్శకుడిగా మారారు. 2017లో వచ్చిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. నాని, సాయి పల్లవిలు ప్రధాన పాత్రల్లో నటించారు. 2021లో వచ్చిన ‘వకీల్‌ సాబ్‌’ సినిమాతో వేణు శ్రీరామ్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఈ చిత్రం వచ్చింది. వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ టైమ్‌లోనే పవన్‌కు, వేణుకు మంచి ర్యాపో ఏర్పడింది.

వకీల్‌ సాబ్‌ తర్వాత ఆయన ఏ సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఏ మూవీని ప్రకటించలేదు. వేణు దర్శకత్వం వహించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌’ హిందీలో రీమేక్‌ అయింది. నికమ్మ పేరిట 2021లో విడుదల అయింది. మరి, నందమూరి నట సింహం బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.