నేటి సోషల్ మీడియా యుగంలో ఏ విషయం అయినా క్షణాల్లో ప్రజల్లోకి చేరిపోతోంది. దాంతో సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ సోషల్ మీడియాను ప్రచారానికి వాడుకుంటున్నారు. తమకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇంతవరకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లేకపోడం గమనార్హం. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు జనసేనాని. ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ సోషల్ మీడియా అయిన ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ను కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. పాలిటిక్స్, సినిమాకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ట్విట్టర్ లో పవన్ కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు అని తెలియగానే.. 2.18K ఫాలోవర్స్ వచ్చారు. ఇక తమ అభిమాన నాయకుడు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.