iDreamPost
android-app
ios-app

Mr. Bachchan: ‘మిస్టర్ బచ్చన్​’కు దిమ్మతిరిగే బిజినెస్! హరీష్ శంకర్ మ్యాజిక్ చేశాడు!

  • Published Jul 24, 2024 | 7:38 PMUpdated Jul 24, 2024 | 7:38 PM

Harish Shankar: డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజతో ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమవుతోంది.

Harish Shankar: డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజతో ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు సిద్ధమవుతోంది.

  • Published Jul 24, 2024 | 7:38 PMUpdated Jul 24, 2024 | 7:38 PM
Mr. Bachchan: ‘మిస్టర్ బచ్చన్​’కు దిమ్మతిరిగే బిజినెస్! హరీష్ శంకర్ మ్యాజిక్ చేశాడు!

తాను నమ్మిన కథను మంచి కమర్షియల్ విలువలు జోడించి అందరికీ నచ్చేలా చెప్పడంలో టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్​ శంకర్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఆయన సినిమాల్లో వినోదం పుష్కలంగా ఉంటుంది. అలాగని మొత్తం కామెడీతోనే సినిమాను చుట్టేయరు. స్టోరీని నడిపిస్తూ అవసరాన్ని బట్టి కామెడీ టచ్ ఇస్తూ పోతారు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్​ను కూడా బాగా పండేలా చూసుకుంటారు. విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ఆడియెన్స్​ను అలరించే హరీష్ శంకర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు పవర్​స్టార్ పవన్ కల్యాణ్​తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనుల్ని చూసుకుంటూనే మరోవైపు మాస్ మహారాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ను తెరకెక్కిస్తున్నారు.

పవన్ సినిమాను పక్కనబెడితే.. ‘మిస్టర్ బచ్చర్​’ను రిలీజ్​కు రెడీ చేస్తున్నారు హరీష్ శంకర్. రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ వర్మ ఫీమేల్ లీడ్ రోల్​లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్​ కూడా దాదాపుగా లాక్ అయిపోయింది. ఆగస్టు 15, 2024న ‘మిస్టర్ బచ్చన్’ విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్​కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​ను పరుగులు పెట్టించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ బిజినెస్ విషయం చర్చనీయాంశంగా మారింది. రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ ఫిల్మ్​కు ఏకంగా రూ.35 నుంచి రూ.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది.

‘మిస్టర్ బచ్చన్’ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్​లో ‘మిస్టర్ బచ్చన్’ అంటూ రీమేక్​కు ప్లాన్ చేయడం సాహసమనే చెప్పాలి. ఆరేళ్ల కింద వచ్చిన బాలీవుడ్ హిట్ బొమ్మ ‘రెయిడ్’ రైట్స్ తీసుకొని రవితేజతో సినిమాకు ప్లాన్ చేశారు హరీష్ శంకర్. నలభై ఏళ్ల కింద జరిగే కథ, పెద్దగా గూస్​బంప్స్ సీన్స్ లేని స్క్రీన్​ప్లేతో బిగ్ రిస్క్​ చేశారు. అయితే రవితేజ-జగపతి బాబు మధ్య క్లాష్ సీన్స్, కమర్షియల్ సాంగ్స్, భాగ్యశ్రీ రొమాన్స్​ను గట్టిగా ప్యాక్​ చేసి ఆడియెన్స్ మీదకు టీజర్స్, సాంగ్స్ రూపంలో వదిలారు. మంచి మాస్ కంటెంట్ ఉండటంతో 35 నుంచి 40 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హీరో-డైరెక్టర్ కలయికలో గతంలో ‘మిరపకాయ’ లాంటి సూపర్ హిట్ పడటం, హరీష్ కంటెంట్​లో చేసిన మార్పులు వర్కౌట్ అవడం, సినిమాలో ఆయన మ్యాజికల్ టచ్ కనిపిస్తుండటంతో ఈ రీమేక్​కు ఊహించని రేంజ్​లో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి