iDreamPost
android-app
ios-app

Anasuya Bharadwaj: పుష్ప 2 షూటింగ్.. ఆ విషయం చెప్తే సుకుమార్ సర్ నన్ను తిడతారు: అనసూయ

  • Published Jul 24, 2024 | 6:22 PM Updated Updated Jul 24, 2024 | 6:22 PM

తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ పుష్ప 2 షూటింగ్ గురించి మాట్లాడే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ విషయం గురించి చెబితే నాకు సుకుమార్ సర్ చేతిలో చివాట్లు పడతాయి అంటూ చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెెళితే..

తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ పుష్ప 2 షూటింగ్ గురించి మాట్లాడే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ విషయం గురించి చెబితే నాకు సుకుమార్ సర్ చేతిలో చివాట్లు పడతాయి అంటూ చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెెళితే..

  • Published Jul 24, 2024 | 6:22 PMUpdated Jul 24, 2024 | 6:22 PM
Anasuya Bharadwaj: పుష్ప 2 షూటింగ్.. ఆ విషయం చెప్తే సుకుమార్ సర్ నన్ను తిడతారు: అనసూయ

పుష్ప 2.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ విషయం నేను చెప్పింది కాదు. IMDB చెప్పింది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి ఇటు సుకుమార్ నుంచి గానీ.. అటు అల్లు అర్జున్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ఈ విషయంపై రకరకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. దాంతో ఇన్ టైమ్ కు పుష్ప 2 రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. కానీ మేకర్స్ మాత్రం డిసెంబర్ 6నే వస్తామని గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ పుష్ప 2 షూటింగ్ గురించి మాట్లాడే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర యాంకర్ గా క్రేజ్ సంపాదించుకుని, ఇప్పుడు వెండితెరపై నటిగా ఓ వెలుగు వెలుగోతోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. దూసుకెళ్తోంది. పుష్ప పార్ట్ 1లో తనదైన నటనతో మెప్పించిన ఈమె.. పార్ట్ 2లో అంతకంటే హై రేంజ్ లో ఫర్పామెన్స్ చేసిందని టాక్. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా ఆమె జగపతి బాబు, గౌతమి కీలక పాత్రల్లో నటించిన ‘సింబా’ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనసూయ రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆమెకు ఎదురైంది.

“పుష్ప 2లో మీ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యిందా?” అని ప్రశ్నించగా.. అనసూయ సమాధానం ఇస్తూ..”ఈ విషయం గురించి చెప్పొచ్చని మీకు చెప్పారా ఎవరైనా? అమ్మో నాకు చెప్పాలంటే భయం. సుకుమార్ సర్ చేతిలో నాకు చివాట్లు పడతాయి. నేను చెప్పను” అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. దాంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇక సింబా మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటుగా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజేందర్ రెడ్డి మరో నిర్మాత. కాగా.. ఆగస్ట్ 9న సింబా థియేటర్లలో సందడి చేయనున్నాడు. మరి అనసూయ స్వీట్ ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio