iDreamPost
android-app
ios-app

Movies: రీ రిలీజ్ ట్రెండ్ క్రేజ్ తగ్గిందా?

  • Published Mar 28, 2024 | 10:03 AM Updated Updated Mar 28, 2024 | 10:03 AM

గత సంవత్సరం కాలంగా టాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ జోరుగా సాగింది.ఎందుకంటే ఏదైనా సరే సక్సెస్ వస్తుంది కదా అని అదే పనిగా రిపీట్ చేస్తే ఫలితాలు అనుకున్నట్లు రావు.

గత సంవత్సరం కాలంగా టాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ జోరుగా సాగింది.ఎందుకంటే ఏదైనా సరే సక్సెస్ వస్తుంది కదా అని అదే పనిగా రిపీట్ చేస్తే ఫలితాలు అనుకున్నట్లు రావు.

  • Published Mar 28, 2024 | 10:03 AMUpdated Mar 28, 2024 | 10:03 AM
Movies: రీ రిలీజ్ ట్రెండ్ క్రేజ్ తగ్గిందా?

గత సంవత్సరం కాలంగా టాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ జోరుగా సాగింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్ల పాత సినిమాలని మళ్ళీ థియేటర్లలో చూసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఒక దశలో కొత్త సినిమాలకు పోటీ ఇచ్చే స్థాయిలో పాత సినిమాలు రీ రిలీజ్ లో భారీ వసూళ్లు సాధించాయి. పోకిరి, ఖుషి, ఆరెంజ్ వంటి తెలుగు సినిమాలతో పాటు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 3 వంటి తమిళ సినిమాలు కూడా రీ రిలీజ్ లో సక్సెస్ అయ్యాయి. ఐతే ఈ రీ రిలీజ్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు మెల్లగా తగ్గిపోయినట్లుగా కనిపిస్తుంది.

ఎందుకంటే ఏదైనా సరే సక్సెస్ వస్తుంది కదా అని అదే పనిగా రిపీట్ చేస్తే ఫలితాలు అనుకున్నట్లు రావు. ప్రేక్షకులలో కూడా మొదట్లో ఉన్న ఉత్సాహం కొద్ది రోజులయ్యాక అదే స్థాయిలో ఉండదు. అందుకే రాను రాను రీ రిలీజ్ సినిమాల పై ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయారు. ఫలితంగా పాత సినిమాల రీ రిలీజ్ రైట్స్ కొన్న వారికి చేదు అనుభవం ఎదురైంది. గుడుంబా శంకర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు రీ రిలీజ్ లో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేక పోయాయి. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్ సినిమా మగధీర థియేటర్లలో విడుదల అయింది. అయితే అందరూ అనుకున్నట్టు ఈ సినిమా రీ రిలీజ్ కు భారీ రెస్పాన్స్ రాలేదు.

legend

నిజానికి, “మగధీర” సినిమాకి షోలు తక్కువే ఏర్పాటు చేసినా, బుకింగ్స్ బాగానే ఉన్నాయన్నారు. అయితే ఈ వారంలో టిల్లు స్క్వేర్, ఆడుజీవితం వంటి సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల మగధీరకు స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘లెజెండ్’ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో విడుదల కానుంది. రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్ కు మళ్ళీ ఉపిరి పోస్తుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. మరి 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుంది అనేది చూడాలి.