Krishna Kowshik
సురేష్ కొండేటి.. సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి వెల్ నోటెడ్ పర్సన్. సినిమాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తన ప్రశ్నలతో నటీనటులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అయితే తాజాగా వివాదంలో చిక్కుకున్నారు.
సురేష్ కొండేటి.. సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి వెల్ నోటెడ్ పర్సన్. సినిమాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో తన ప్రశ్నలతో నటీనటులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అయితే తాజాగా వివాదంలో చిక్కుకున్నారు.
Krishna Kowshik
ఇండస్ట్రీలో మూవీ ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లలో తన ప్రశ్నలతో నటీనటులను ఇరకాటంలో పెడుతూ వివాదంలో ఇరుక్కునే సురేష్ కొండేటి.. తాజాగా మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. దీంతో ఈయన మీదే కాకుండా.. మెగా ఫ్యామిలీ మీద, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. సంతోషం సినీ అవార్డ్స్ వేడుకలను గత కొన్ని సంవత్సరాలుగా సురేష్ కొండేటి నిర్వహిస్తున్నారు. తాజాగా గోవాలో సంతోషం సినీ అవార్డ్స్ వేడుకలను నిర్వహించారు. ఈ సారి సౌత్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. అయితే ఆ వేడుకలో నిర్వహణ లోపం కారణంగా కన్నడ పరిశ్రమ.. టాలీవుడ్‌ను వేలెత్తి చూపుతుంది.
ఇటీవల గోవాలో సంతోషం సినీ అవార్డ్స్‌ను నిర్వహించారు. ఆహ్వానాల మేరకు కన్నడ పరిశ్రమకు చెందిన 35 మంది అక్కడకు చేరుకున్నారు. వారిలో కన్నడ సూపర్ స్టార్ హీరో రమేష్ అరవింద్, కాంతార ఫేమ్ సప్తమి గౌడ్ తదితరులు వెళ్లారు. టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించి అవార్డ్స్ ఇవ్వడం అయిపోయాక.. కన్నడ పరిశ్రమకు సంబంధించి అవార్డులను అందజేసేందుకు వేదికపైకి ఎక్కారు రమేష్ అరవింద్. ఇద్దరి ముగ్గురికి అవార్డులు ఇచ్చాక.. అంతలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఎంత సేపటికి కరెంట్ తిరిగి రాకపోవడంతో అక్కడ నుండి వెనుదిరిగారు శాండిల్ వుడ్ ప్రముఖులు. ఈ ఘటనపై మీడియాతో రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. అవార్డులు ఇస్తుండగా.. కరెంట్ పోవడంపై ఆరా తీస్తే.. లైట్స్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని తెలిసిందని, తామే కాదూ మిగిలిన ఇండస్ట్రీకి వ్యక్తులు కూడా ఇబ్బందులకు గురయ్యారంటూ తెలిపారు.
చివరకు ఈ వేడుకలను నిర్వహించిన సురేష్ కొండేటి పేరుతో పాటు అతడు మెగా ఫ్యామిలీకి మంచి స్నేహితుడని, ప్రముఖ స్టార్ పీఆర్వోఓ అంటూ ఏవేవో కథనాలు వచ్చేశాయి. ఈ వార్తలపై స్పందించారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించి.. మెగా కుటుంబానికి అతడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే సురేష్ కొండేటి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు అరవింద్. ‘ ఓ జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తూ ఉన్నాడు. గోవాలో చేసిన వేడుకల్లో సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అక్కడకు తీసుకెళ్లిన వారు ఇబ్బంది పడ్డారు. అయితే మీడియా మా కుటుంబంలోని ఓ ప్రముఖ పీఆర్వో అంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే అతడు మా పీఆర్వోవో అని మేము ఎక్కడా చెప్పలేదు’ అని స్పష్టం చేశాడు.
‘ఎప్పుడైనా అతడు మా పక్కనే కనబడితే.. ఆయన పీఆర్వో అంటూ పత్రికలు రాయడం కరెక్ట్ కాదు. ఆ అవార్డులు ఆయన వ్యక్తిగతం. వాటి నిర్వహణలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఇతర భాషల వాళ్లకు ఇబ్బందులు జరిగాయి. వాళ్లు కూడా తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లింతే అన్నారట. కొన్ని పత్రికల్లో అవి రావడం చూసి బాధేసింది. ఓ వ్యక్తి చేసిన దానికి.. ఎవరికో దానిని ఆపాదించడం కానీ, టాలీవుడ్‌కు ఆపాదించడం కరెక్ట్ కాదు. అతడు ఎవ్వరికీ పీఆర్వో కాదూ.. మా కుటుంబంలోని ఎవ్వరికీ పీఆర్వో కాదు. అతడికి కూడా ఇండస్ట్రీకి ద్రోహం చేయాలన్న ఉద్దేశం లేదు. పర్సనల్‌గా ఫెయిల్యూర్ అయ్యాడు. అది తెలుగు ఇండస్ట్రీకి ఆపాదించవద్దని కోరుతున్నా’అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: అవార్డ్స్ ఫంక్షన్‌లో నటులకు అవమానం.. లైట్లు ఆఫ్ చేసి..